జై ఆంధ్రా.. జై తెలంగాణ.. జై భారత్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ఆవిర్భవించి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంలో గుంటూర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వివిధ మతాలను స్మరిస్తూ.. సభకు వచ్చిన అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత ట్రస్ట్ నుంచి రూ. 50 లక్షలు ఇప్పటం గ్రామపంచాయతీకి ఇస్తామని హామీ ఇచ్చారు. సభ నిర్వహణకు అనుమతులు ఇచ్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. నాకు సరైన మార్గం చూపించిన నా సోదరుడు.. రాజకీయాలపై అవగాహన కల్పించిన వ్యక్తి నాగబాబు అని అన్నారు. నేను ఆది శక్తిని ఆరాధించే వాడిని.. అందుకే ఆదిశక్తి ప్రతిరూపాలైన వీరమహిళకు ధన్యవాదాలు తెలిపారు. స్వాత్రంత్రోద్యమం, తెలంగాణ సాయుధపోరాటం స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఎవరూ మరిచిపోయినా.. దామోదరం సంజీవయ్యను మేం స్మరించుకుంటాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలయ్ బలయ్ స్ఫూర్తిని నాకు తెలియజేసిన సీనియర్ రాజకీయ నాయకులు బండారు దత్తాత్రేయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జై ఆంధ్రా… జై తెలంగాణ.. జై భారత్ అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్
-