జగిత్యాలలో జీవన్ రెడ్డి ‘లాస్ట్’ స్ట్రాటజీ.. గెలుస్తారా?

-

రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది బాగానే పనిచేస్తుందని చెప్పాలి. అయితే అన్నివేళలా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకోవడానికి లేదు. కాకపోతే నాయకుడు అనేవాడు సెంటిమెంట్ తో ప్రజల మనసులు గెలుచుకోవాలనే చూస్తారు. ఉదాహరణకు తెలంగాణ సెంటిమెంట్ తో కే‌సి‌ఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. అయితే ఈ సారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేం.

అలాగే జగన్..వైఎస్సార్ చనిపోయిన సెంటిమెంట్…తను జైలుకు వెళ్ళిన సెంటిమెంట్ తో 2012 ఉపఎన్నికల్లో సత్తా చాటారు. కానీ 2014లో రివర్స్ అయింది. మళ్ళీ 2019 లో ఒక్క ఛాన్స్ అనే సెంటిమెంట్ తో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబ్ లాస్ట్ ఛాన్స్ అంటుంటే..పవన్ ఒక్క ఛాన్స్ అంటున్నారు. జగన్ ఏమో మరొక ఛాన్స్ అని అంటున్నారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ లో పలువురు సీనియర్లు లాస్ట్ ఛాన్స్ అని అడుగుతున్నారు.

ఈ ఎన్నికలే తమకు చివరి ఎన్నికలు అని, తర్వాత రాజకీయాల్లో ఉండమని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. ఇక జగిత్యాల నుంచి ఆరుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసిన జీవన్ రెడ్డి..ఈ సారి వచ్చే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అని అంటున్నారు. అయితే 2014లోనే జీవన్ రెడ్డి లాస్ట్ ఛాన్స్ అని గెలిచారు. కానీ 2018లో మళ్ళీ నిలబడ్డారు. దీంతో ప్రజలు నమ్మలేదు. జీవన్ రెడ్డిని ఓడించారు. తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు.

ఇక జీవన్ రెడ్డిపై బి‌ఆర్‌ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్..మరొక్క ఛాన్స్ ఇస్తే చాలు..జగిత్యాలని ఇంకా అభివృద్ధి చేస్తానని అంటున్నారు. ఇటు జీవన్ రెడ్డి ఇంకా ఇదే లాస్ట్..ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే జగిత్యాల ప్రజలు ఈ సారి జీవన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? లేదా సంజయ్ వైపు మొగ్గు చూపుతారా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news