ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి చాలా జాగ్రత్తలు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఈ వైరస్ నుండి ప్రజలను కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే చోట్ల తిరగకూడదని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేస్తున్నాయి. వైరస్ ఎక్కువగా ఉండే దేశాల్లో అయితే ప్రజల ఇంటి నుండి బయటకు వస్తే అరెస్టు చేస్తామని కూడా డేంజర్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో ప్రజలకు వైరస్ పై అవగాహన కలిగించడానికి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో జాగ్రత్తలు మరియు సూచనలు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ జగన్ మరియు మహేష్ బాబు వీళ్ళ కంటే తానే బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు కేఏ పాల్. మేటర్ లోకి వెళ్తే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ తెలుగు ప్రజల కోసం వీడియో రూపంలో మెసేజ్ ఇవ్వటం జరిగింది. కరోనా బాధితులను ఆదుకునేందకు తన వంతు సహాయం చేస్తానని కేఏ పాల్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
“దేశంలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. బాధితులకు నా వంతు సాయం చేసేందుకు సిద్ధం. మా సంస్థలకు సంగారెడ్డి లో 300 పడకల గదులు విశాఖపట్నంలో 100 పడకల గదులు గల చారిటీ సిటిస్ ఉన్నాయి. వాటిని తెలుగు ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు. ఇందుకు డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వాడుకోవచ్చు” అంటూ ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చారు. ఇలాంటి సాయం మహేష్ మరియు పవన్ అలాగే అధికారంలో ఉన్న జగన్ కూడా చేయలేదని తాజాగా కె.ఎ.పాల్ ఇచ్చిన సందేశం పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.