సిఎం కెసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మాజీ యువనేత పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో… కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి కౌశిక్ రెడ్డిని టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి తో సహా ఆయన అనుచరులు కూడా టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Kaushik Reddy Padi

కాగా ఇటీవలే ఆడియో టేప్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నాడంటూ….కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కౌశిక్ రెడ్డి.