సోషల్ మీడియాలో పని చేసే వాళ్లకు కెసిఆర్ గుడ్ న్యూస్…?

-

సోషల్ మీడియా విషయంలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇప్పుడు సీరియస్ గానే దృష్టి సారించింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా విషయంలో ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా సోషల్ మీడియాను బలోపేతం చేసే విధంగా సూచనలు సలహాలు ఇస్తున్నారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాకు సంబంధించి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి కేటీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కూడా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక సోషల్ మీడియా టీం ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆసక్తికరంగా ఉండే కొంతమందిని ఇప్పుడు ముందుకు తీసుకువచ్చి ఉపాధి కల్పించే విధంగా టిఆర్ఎస్ పార్టీ తరఫున వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాకు సంబంధించి ప్రతీ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఒక ఆఫీసులో కూడా ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ తరఫున నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సోషల్ మీడియాలో చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ కొంతమందికి సూచనలు చేస్తున్నారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ప్రత్యేక బృందాలను టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news