దూకుడు పెంచిన కాంగ్రెస్ టార్గెట్ కేసీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, దూకుడు వైఖరితో రాష్ట్ర ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర సీనియర్ నేతలతో సమావేశమై తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై తీవ్రస్థాయిలో చర్చించారు.భారత్ రాష్ట్ర సమితి,బీజేపీ రెండు ఒకటేనని ఈ మీటింగ్లో ఓ క్లారిటీకి వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టి అవినీతి, అక్రమాలపై విస్తృత ప్రచారం చేసి ఆ పార్టీని ఓడించడమే అజెండాగా వ్యూహరచన చేస్తున్నారు.

- Advertisement -

తెలంగాణలో మార్పు కోసం కాంగ్రెస్ వైపు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని ఖర్గే అన్నారు. రాష్ట్రంలో అధికార వ్యతిరేక ఓట్ల విభజనను నిరోధించేందుకు BRS-BJP రహస్య ఒప్పందాన్ని బయట పెట్టడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టబోమని ఆయన పేర్కొన్నారు.కేసీఆర్ భూస్వామ్య ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా బీఆర్‌ఎస్, బీజేపీల అపవిత్ర పొత్తును బట్టబయలు చేసేందుకు వ్యూహం సిద్ధం చేశామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.ఆయనతో ఎన్నికల వ్యూహంపై చర్చించిన ఖర్గే.. తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజల వాణిని విని తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించింది కాంగ్రెస్ అని ట్విట్టర్ ద్వారా వారు ప్రజలకు తెలియజేసారు.బీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందాన్ని రాజకీయ సవాల్‌గా పరిగణిస్తూ.. అధికార వ్యతిరేక ఓట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లకుండా ఉండాలంటే కేసీఆర్, బీజేపీ మధ్య దోస్తీపై ప్రజలకు మరింతగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

కొన్ని నెలల క్రితం వరకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలని తెగ ప్రయత్నాలు చేసిన చంద్రశేఖర్ రావు హఠాత్తుగా ఈ దీక్షను విరమించుకున్నారు. ఇది మాత్రమే కాదు, పాట్నాలో జరిగే విపక్ష ఐక్యత సాధారణ సమావేశానికి హాజరు కావాల్సిందిగా నితీష్ కుమార్ పంపిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు.గత కొన్నేళ్లుగా కేసీఆర్ ప్రధాని మోదీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేసింది. ఈసారి కేసీఆర్ కి అవకాశం ఇవ్వకుండా తెలంగాణలో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...