కేసీఆర్ మార్క్ రిజర్వేషన్… ఎవరికి లాభం?

-

మంత్రి పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో కేసీఆర్ సామాజిక న్యాయం అనుసరించారా? తెలంగాణ కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఎన్ని మంత్రిపదవులు ఇచ్చారు? ఈ సామాజికవర్గాల్లో ఎవరికి కీలక బాధ్యతలు ఇచ్చారు? వెనుకబడిన తరగతుల జనాలకోసం ఇచ్చిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎన్ని పూర్తిగా నెరవేర్చారు? సమాధానం.. కేసీఆర్ తో పాటు యావత్ తెలంగాణ బిడ్డలకెరుకే!

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ చేయని విధంగా “సామాజిక న్యాయం” పాటపాడుతున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం చేస్తానంటూ రెడీ అయ్యారు. మద్యం దుకాణాల్లో అందరికీ సమానంగా న్యాయం చేసేందుకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అయితే… కేసీఆర్ చేస్తున్న రిజర్వేషన్ల సామాజిక న్యాయంలో పేదలకు అవకాశం దక్కుతుందా? కోట్ల రూపాయలు టెండర్ పెట్టాల్సిన ఈ రంగంలో పేదలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినా దక్కే ఫలితం ఎంత?

మధ్యం దుకాణాల్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ ఎదుర్కొంటున్న ప్రశ్నలు ఇవి. తమకు కేటాయించిన రిజర్వేషన్స్ ప్రకారం మద్యం దుకాణాలు దక్కించుకునే అంత రిచ్ దళితులు తెలంగాణలో ఉన్నారా? ఒకవేళ ఉన్నా… ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారా? అలా కాకుండా… ఎస్సీ ఎస్టీల పేరిట దుకాణాలను దక్కించుకొని నిర్వహించుకునేందుకు ఇతర బలవంతులకు ఈ రిజర్వేషన్లు ఉపయోగపడబోతున్నాయా?

కేసీఆర్ సర్కార్ మనసుపెట్టి ఆలోచించాల్సిన అంశం ఇది. ఎందుకంటే… తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లలో గౌడ సామాజిక వర్గానికి 15శాతం రిజర్వేషన్ కల్పించగా.. 10శాతం ఎస్సీలకు 5 శాతం ఎస్టీలకు కేటాయించింది. ప్రస్తుతం నడుస్తున్న లైసెస్న్స్ లు ఈ నెలతో ముగుస్తాయి కాబట్టి… తర్వాత గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిస్తారు. మరి వారికి అంత సామర్థ్యం డబ్బు పరపతి ఉన్నాయా? లేక, వారిపేరు మీద బడాబాబులు ఈ రిజర్వేషన్లు వాడుకుంటారా? ఇదేనా కేసీఆర్ మార్క్ సామాజిక న్యాయం? కేసీఆర్ & కో లకే తెలియాలి!

– CH Raja

Read more RELATED
Recommended to you

Latest news