చంద్రబాబుని కనపడకుండా దెబ్బ కొట్టిన కెసిఆర్…! ఎలా అంటే…!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం రాష్ట్ర విభజన ఆలస్యానికి ప్రధాన కారణమైంది. అప్పట్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు కూడా హైదరాబాద్‌ స్థాయిలో కొంతైనా అభివృద్ధి చెంది ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేది. ప్రభుత్వంగా రాష్ట్రంలోని ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటా౦, అవి విపక్షాలకు నచ్చక విమర్శలు చేస్తుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు”

సోమవారం ప్రగతి భవన్ లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చేసిన వ్యాఖ్య అది. మూడు రాజధానుల ప్రస్తావన ఇద్దరి మధ్య వచ్చింది. కెసిఆర్ సలహాలను, సూచనలను జగన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజదానులకు వ్యతిరేకంగా చంద్రబాబు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ రాష్ట్ర౦ మొత్తం తిరుగుతున్నారు. ఈ తరుణంలో కెసిఆర్ ని జగన్ కలవగా… అసలు చంద్రబాబుని పట్టించుకోవద్దని,

ఆ ఆందోళనల గురించి ఆలోచించ వద్దని పరోక్షంగా చెప్పినట్టే కనపడుతుంది. మూడు రాజదానులకు కెసిఆర్ మద్దతు ఇవ్వడంతో జగన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక చంద్రబాబు పోరాట౦ గురించి కెసిఆర్ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇక కేంద్రం గురించి గాని, రాష్ట్రంలో జనసేన, బిజెపి గురించి గాని ఆలోచించే ప్రయత్నం చేయవద్దని, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని కెసిఆర్, జగన్ కి చెప్పినట్టు సమాచారం.