తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా దాంట్లో ఓ అర్థం ఉంటుంది. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు అంతా హేళన చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాలన చేతగాక ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన కాంగ్రెస్ నేతలు.. సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు చేయగానే నీళ్లు నమిలారు. కేసీఆర్ పై రివర్స్ ప్లేట్ ఫిరాయించి… ఆయనకు పాలన చేతగాలేదు. అందుకే.. ముందస్తుకు వెళ్లాడు. ఆయన గోతి ఆయనే తీసుకున్నడు అంటూ హేళన చేశారు.
కానీ.. ఏమైంది. పర్ ఫెక్ట్ ప్లాన్ తో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు కేసీఆర్. ప్రతిపక్షాలకు కనీసం ఆలోచించుకోవడానికి కూడా సమయం లేకుండా చేశారు. సీఎం కేసీఆర్ ను ఒక్కరిగా ఎదుర్కోలేక… కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమి అంటూ పెట్టారు. అందులోనూ ఎన్నో గొడవలు. చివరకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. ఎన్నికలు సమీపించినా కూటమిలో సీట్ల లొల్లి తేలలేదు. అయినా.. బూటకపు సర్వేలు చేయించి.. ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందంటూ కాంగ్రెస్ నేతలు కల్లిబొల్లి మాటలు మాట్లాడారు. ఆంధ్రా నుంచి చంద్రబాబును మోసుకొచ్చి మరీ తెలంగాణలో ప్రచారం చేయించారు. అది అడ్డంగా బెడిసికొట్టింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమించిన చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ పార్టీని.. మొత్తంగా కూటమినే తెలంగాణ ప్రజలు ఘోరంగా ఓడించారు. దీంతో అన్నీ మూసుకొని చంద్రబాబు ఆంధ్రాకు వెళ్లిపోయాడు.
అఖండ మెజార్టీతో గెలిచిన కేసీఆర్.. తెలంగాణలో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇటీవలే ఆయన దేశంలోని వివిధ రాజకీయ నాయకులను కలవడం ప్రారంభించారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర ఫ్రంటే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తోడయ్యారు. ఆయనతో భేటీ అయ్యారు. ఆయన కూడా ఫెడరల్ ఫ్రంట్ కు సానుకూలంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. ఆమె కూడా ఫెడరల్ ఫ్రంట్ కు సానుకూలంగా స్పందించారు. యూపీ లీడర్ అఖిలేశ్ ను కూడా కలుస్తున్నారు కేసీఆర్. ఏతావాతా అర్థం అయ్యేదేంటంటే.. సీఎం కేసీఆర్ ఏది చేసినా.. దాని వెనుక ఓ మతలబు ఉంటుంది. దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్ కూడా అంతే. పర్ ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తారు ఆయన. ఏమో.. చెప్పలేం. 2019 ఎన్నికల్లో అటు బీజేపీ కాకుండా… ఇటు కాంగ్రెస్ కాకుండా.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని ఫెడరల్ ప్రంట్ అధికారంలోకి వచ్చినా రావచ్చు. వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.