మెలికపెట్టి ఇరకాటం లో పెట్టిన కే‌సి‌ఆర్ – గిలగిలలాడుతున్నాడు ఈ లీడర్ !

-

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో బిజెపి పార్టీ నేతలు గెలుపు కోసం ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో పసుపు బోర్డు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. టిఆర్ఎస్ పార్టీ ఎంపీ కాండేట్ గా కెసిఆర్ కూతురు కవిత ఓడిపోవడంతో బీజేపీ పార్టీ గెలవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నేతలు ఈ గెలుపు ఆధారం చేసుకుని కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.

Image result for kcr"

ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ గా ఇక్కడ గెలిచినా అరవింద్‌ ఎదురు లేని నాయకుడిగా తెలంగాణ రాజకీయాల్లో చాలా వ్యాఖ్యలు చేశాడు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిజామాబాద్ జిల్లాలో సుగంధద్రవ్యాల బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులు పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే..స్పైస్ బోర్డు బిజెపి ప్రభుత్వం ప్రకటించడం దారుణమని అన్నారు.

 

దీంతో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ని నిలదీయాలని రాజకీయంగా మెలిక పెట్టాలని ఇరకాటంలో పడేయాలని కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లోకి రంగంలోకి పంపినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీ గల్లంతు కావడంతో ఈ దెబ్బతో అరవింద్ కి కూడా చెక్ పెట్టాలని కేసీఆర్ సంచలన స్కెచ్ వేసినట్లు పొలిటికల్ టాక్. దీంతో తాజాగా కేంద్రం ప్రకటించిన స్పైస్ బోర్డు పట్ల నిజామాబాద్ ఎంపీ కూడా ఈ బోర్డ్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదని నిజామాబాద్ ప్రజలు ఎదురు తిరుగుతారమో అని గిలగిలలాడుతున్నాడు అన్నట్లు బీజేపీ పార్టీలో టాక్.  

Read more RELATED
Recommended to you

Latest news