సీఎం కేసీఆర్ యాదాద్రి, జనగామ పర్యటనతో మరోసారి టీఆర్ఎస్ పనితనాన్ని, పథకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. భారీ బహిరంగ సభల ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే కేసీఆర్ పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హల్చల్ చేయడం ఇప్పుడు అందరి ద్రుష్టిని ఆకర్షిస్తోంది. జనగామ కలెక్టరేట్ ఓపెనింగ్ సమయంలో ప్రభుత్వంపై ప్రశంసలు కూడా కురిపించారు. తెలంగాణ నాయకులం ఒకరితో ఒకరం గొడవలు పడవద్దని .. తెలంగాణ డెవలప్మెంట్ కు పాటు పడాలని సూచించారు. టీాఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకానలను ప్రవేశపెట్టిందంటూ.. ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల కారణంగా .. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి త్వరలో టీఆర్ ఎస్ పార్టీలో చేరుతారేమో అంటూ.. ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సీఎం కేసీఆర్ తో ఫోటో దిగడం, సభలో ముఖ్యమంత్రిని ప్రశంసించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి… దీనిపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన ప్రాంత అభివ్రుద్ది కోసమే సీఎంను కలిశా అని.. వినతి పత్రం కూడా ఇచ్చానని అన్నారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని.. కేసీఆర్ ఫామ్ హౌజ్ పక్కనే తన భువనగిరి నియోజకవర్గం ఉన్నా ఆయన ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు.