కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

-

ఢిల్లీ: ఢిల్లీ లో ఇవాళ కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి భేటి అయ్యారు. ఈ సందర్బంగా నియోజకవర్గ అంశాలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు కోమటిరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ..  రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడని.. పిసిసి నా దృష్టిలో చాలా చిన్న పదవి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి గురించి నా దగ్గర మాట్లాడవద్దని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పా..అభివృద్ధి పైనే దృష్టి సారించానన్నారు.

 

తెలంగాణ లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పై కిషన్ రెడ్డితో చర్చించానని.. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ లో ఉన్న ఫార్మా కంపెనీలను సహితం హైద్రారాబాద్ చుట్టూ పక్కలకు మార్చాలని చూస్తున్నారని.. ఫార్మాసీటి కి 19 వేల ఎకరాలు ఒకే దగ్గర అవసరం లేదన్నారు.. కిషన్ రెడ్డి మొదటి నుంచి వివాద రహితుడు, సౌమ్యుడు, అనేక సంవత్సరాలు కలిసి పనిచేసామన్నారు.

అందుకే కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా పార్టీ మరే ఆలోచన లేదని…నేనేందుకు పార్టీ మారుతా? అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు నడిపే సమర్ధవంతమైన నాయకుడు లేడని.. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధి పై దృష్టి సారించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news