తెలుగు అకాడమీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

-

అమరావతి : తెలుగు అకాడమీ పేరు మార్పుపై తెలుగు-సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు
నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేమిటి ? పేరు మార్పు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగవు కదా అని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో విమర్శించే వారు చెప్పాలని మండిపడ్డారు. నష్టం ఏమిటో చెప్పకుండా ఏదో ఘోరం జరిగి పోయినట్లు ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు? అని విమర్శలు చేశారు లక్ష్మీపార్వతి.

తెలుగు భాషాభివృద్ధితో, పాటు సంస్కృత భాషాభివృద్ధికి జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అందరూ అభినందించాలని.. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని మనవి చేస్తున్నానని పేర్కొన్నారు లక్ష్మీపార్వతి. కాగా నిన్ననే తెలుగు అకాడమీ పేరులో మార్పు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ను అకాడమీలో పాలకవర్గ సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news