టీడీపీలో చేరిన కోటంరెడ్డి..నెల్లూరులో లీడ్!

-

తెలుగుదేశం పార్టీలోకి నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల క్రితం కోటంరెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. తనపై సొంత పార్టీ వాళ్లే నిఘా పెట్టారని, అలాగే తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని, నమ్మకం లేని చోట ఉండలేనని చెప్పి కోటంరెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చారు.

అప్పటినుంచి ఆయన వైసీపీపై పోరాటం చేస్తున్నారు. అలాగే ఆయన టి‌డి‌పిలో చేరతానని చెప్పారు. కాకపోతే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన డైరక్ట్ గా టి‌డి‌పిలో చేరలేదు. దీంతో ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిని టి‌డిపిలోకి పంపించారు. ఎన్నికల ముందు కోటంరెడ్డి టి‌డి‌పిలోకి వచ్చి..నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక కోటంరెడ్డి రాకతో నెల్లూరులో టి‌డి‌పికి కొత్త ఊపు వస్తుందనే చెప్పాలి. నెల్లూరు రూరల్లో టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. కానీ ఇప్పుడు కోటంరెడ్డి ఎంట్రీతో పార్టీకి ప్లస్ అవుతుంది.

అటు ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం టి‌డి‌పిలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా కొంతమంది నెల్లూరు నేతలు టి‌డి‌పిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నెల్లూరులో టి‌డి‌పి బలం పెరుగుతూ వస్తుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో జిల్లాలో టి‌డి‌పి ఒక సీటు కూడా గెలుచుకోలేదు. కానీ జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకునేలా ఉంది.

ఇటీవల వచ్చిన ఓ సర్వేలో జిల్లాలో టి‌డి‌పి 5 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, వైసీపీకి 2 సీట్లు మాత్రమే గెల్చుకునే ఛాన్స్ ఉండన్, 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news