దూకుడు పెంచిన కేటిఆర్..!

-

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయ౦ సాధించాలని అధికార విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి విపక్షాలకు చుక్కలు చూపించాలని తెరాస భావిస్తుంటే, ఎలా అయినా సరే గెలిచి తెరాస కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. రాజకీయంగా తెరాస అత్యంత బలంగా ఉన్న నేపధ్యంలో ఈ ఎన్నికలను ఎదుర్కోవడం అనేది ఇప్పుడు విపక్షాలకు కత్తి మీద సాములా మారింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని కీలక పరిణామాలు మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్ధులను దారికి తెచ్చుకోవడానికి కాంగ్రెస్, తెరాస పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెరాసలో కాస్త రెబల్స్ బెడద ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలోకి వస్తే పదవులు ఇస్తామని స్పష్టంగా చెప్తున్నారు.

అయితే దీనిని కేటిఆర్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. రెబల్స్ అభ్యర్ధులతో నేరుగా ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వ్యక్తిగత హామీలు ఇస్తూ నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నారు. ఇది రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. రెబల్స్ ని తన వైపుకి తిప్పుకోవాలని రేవంత్ భావిస్తున్నా, కేటిఆర్ స్వయంగా మంత్రి కావడంతో ఆయన ఇచ్చే హామీని రెబల్స్ నమ్మి వెనక్కు తగ్గుతున్నారు. దీనితో రేవంత్ ఆటలు సాగడం లేదని, కేటిఆర్ దిగితే వార్ వన్ సైడ్ అంటూ తెరాస శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news