కేటిఆర్ వర్సెస్ విపక్షాలు…?

-

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రసవత్తరంగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలిచి అధికార తెరాస ని ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నాయి విపక్షాలు. కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే రాజకీయం చేస్తూ ఉండగా బిజెపి కాస్త అటు ఇటుగా తన ప్రయత్నాలు చేస్తుంది. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు తెరాస ని దాటి ఆ రెండు పార్టీలు ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేకపోతున్నాయి.

ముందు రెబల్స్ ద్వారా ఏదో సాధించేద్దాం అని భావించినా కేటిఆర్ ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రెబల్స్ కి నేరుగా కేటిఆర్ నుంచే హామీ రావడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఈ తరుణంలో కేటిఆర్ దూకుడు మరింతగా ఆ రెండు పార్టీలను ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. ఆయన ప్రతీ జిల్లా ప్రతీ నియోజకవర్గం మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. అక్కడి స్థానిక నేతలతో కేటిఆర్ మాట్లాడుతున్నారు.

వాళ్లకు ఫోన్లు చేసి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాదు ఎన్నికల తర్వాత ఎం చేస్తారో చేసేది కూడా స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో మీకు ప్రాధాన్యత ఉంటుందని వారికి హామీ ఇవ్వడంతో పాటుగా వ్యక్తిగత సమస్యలు ఉంటే నేరుగా నన్ను కలవండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే విపక్షాలకు చుక్కలు చూపిస్తుంది. మంత్రి నుంచి ఆ స్థాయిలో హామీ రావడంతో వాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేస్తున్నారు. విపక్షాలు ఎం చెప్పినా సరే వినే పరిస్థితి దాదాపుగా కనపడటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news