ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఏపీ స‌ర్వే వ‌చ్చేసింది…!

-

ఇది.. అసలైన టెన్షన్ అంటే. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లగడపాటి రాజగోపాల్ సర్వే వచ్చేసింది. లగడపాటి రాజగోపాల్ సర్వేల గురించి మనకు తెలిసిందే కదా. ఆయన ఏ సర్వే చేసినా ఆ సర్వే ఫలితాలే ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయని అంతా అనుకుంటారు. అందుకే.. అందరూ లగడపాటి సర్వే కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. అయితే.. లగడపాటి ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాక తన సర్వే వివరాలను విడుదల చేస్తానని ప్రకటించినా.. సరిగ్గా పోలింగ్‌కు ఒక్క రోజు ముందే లగడపాటి తన సర్వేను రిలీజ్ చేశాడు. ఈ సర్వేలో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరంగా వెల్లడించారు. మొత్తంగా ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీకి 103, టీడీపీకి 66, జనసేనకు 6, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీఎఐ, స్వతంత్రులకు ఒక్క సీటు కూడా రాదని సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారని.. టీడీపీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే.. ఈ సర్వే లగడపాటి అఫీషియల్‌గా రిలీజ్ చేసిందా? లేదా? అనేది మాత్రం తెలియలేదు. వాట్సప్‌లో మాత్రం వైరల్‌గా మారింది. ఆ స‌ర్వేకు సంబంధించి పూర్తి వివ‌రాలు మీ కోసం..

Lagadapati Rajagopal AP survey 2019

1 ) 10 అసెంబ్లీ స్థానాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో..

టీడీపీ : 4
వైసీపీ : 6
జనసేన : 0
ఇత‌రులు : 0

2 ) 9 అసెంబ్లీ స్థానాలు ఉన్న విజయనగరం జిల్లాలో..

టీడీపీ : 4
వైసీపీ : 5
జనసేన : 0
ఇత‌రులు : 0

3 ) 15 అసెంబ్లీ స్థానాలు ఉన్న విశాఖపట్నం జిల్లాలో ..
టీడీపీ : 6
వైసీపీ : 9
జనసేన : 0
ఇత‌రులు : 0

4 ) 19 అసెంబ్లీ స్థానాలు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో..
టీడీపీ : 6
వైసీపీ : 11
జనసేన : 02
ఇత‌రులు : 0


5 ) 15 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ..
టీడీపీ : 4
వైసీపీ : 7
జనసేన : 4
ఇత‌రులు : 0

6 ) 16 అసెంబ్లీ స్థానాలు ఉన్న కృష్ణా జిల్లాలో..
టీడీపీ : 5
వైసీపీ : 11
జనసేన : 0
ఇత‌రులు : 0

7 ) 17 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుంటూరు జిల్లాలో..
టీడీపీ : 4
వైసీపీ : 13
జనసేన : 0
ఇత‌రులు : 0

8 ) 12 అసెంబ్లీ స్థానాలు ఉన్న ప్రకాశం జిల్లాలో..
టీడీపీ : 5
వైసీపీ : 7
జనసేన : 0
ఇత‌రులు : 0

9 ) 10 అసెంబ్లీ స్థానాలు ఉన్న నెల్లూరు జిల్లాలో..
టీడీపీ : 3
వైసీపీ : 7
జనసేన : 0
ఇత‌రులు : 0

10 ) 10 అసెంబ్లీ స్థానాలు ఉన్న కడప జిల్లాలో..
టీడీపీ : 3
వైసీపీ : 7
జనసేన : 0
ఇత‌రులు : 0

11 ) 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నూల్ జిల్లాలో..
టీడీపీ : 6
వైసీపీ : 8
జనసేన : 0
ఇత‌రులు : 0

12 ) 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న అనంతపురం జిల్లాలో..
టీడీపీ : 4
వైసీపీ : 10
జనసేన : 0

13 ) 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న చిత్తూరు జిల్లాలో..
టీడీపీ : 6
వైసీపీ : 8
జనసేన : 0
ఇత‌రులు : 0

175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో..
టీడీపీ : 66
వైసీపీ : 103
జనసేన : 06
ఇత‌రులు : 0

Read more RELATED
Recommended to you

Exit mobile version