నామినేటెడ్ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్న గుంటూరు జిల్లా నేతలు..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. నామినేటెడ్ పదవుల కోసం ఆ పార్టీలోనే సీనియర్ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.. టిక్కెట్ త్యాగం చేయడంతో.. కచ్చితంగా తమకి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు గాను కూటం అభ్యర్థులు 17 చోట్ల గెలిచారు.. కొన్నిచోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిన నేతల సహకారం.. మరికొన్నిచోట్ల టిక్కెట్ త్యాగాలతో కూటమి అభ్యర్థులు బయటపడ్డారు.. మొదటి లిస్టులోనే తమకు ప్రాధాన్యత ఉంటుందని ఆ జిల్లాలో ఉండే సీనియర్ నేతలు భావిస్తున్నారట.. వాళ్ళ అనుచరులైతే.. పలానా పోస్టు మా నాయకుడికి వస్తుందంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారట..

సీనియర్ నేతలతో పాటు ద్వితీయశ్రేణి నేతలు కూడా నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారని ప్రచారం నడుస్తుంది.. ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కబోతుందంటూ.. తమ ప్రొఫైల్ని అధిష్టానానికి సైతం పంపారట.. అయితే సీనియర్ల తర్వాతే తమకు అధిష్టానం ప్రాధాన్యతీస్తుందని చర్చించుకుంటున్నారు.. నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారిలో.. మాజీ మంత్రి ఆలపాటి రాజా, డొక్కా మాణిక్య వరప్రసాద్ , మాజీ ఎమ్మెల్యేలతో పాటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.

వీళ్ళందరూ కూడా రాష్ట్రస్థాయి పదవిని ఆశిస్తున్నారని వారి శిబిరం చెపుతుంది.. టిడిపిలో చేరే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి దానికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు.. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ని కొనసాగిస్తామని టిటిడిలో బోర్డు మెంబర్ గా అవకాశం కల్పిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారట.. దాని ప్రకారం తనకి రెండు పదవులు వస్తాయని ఆయన ఆశిస్తున్నారు..

అలాగే ఉండవల్లి శ్రీదేవి కూడా ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ పోస్ట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా తన సామాజిక వర్గానికి చెందిన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటూ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని గుంటూరు జిల్లాలో టాక్ నడుస్తోంది.. సీఎం చంద్రబాబు కూడా గుంటూరు జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. సీనియర్ నాయకులకి మొదటి ప్రయారిటీ ఇవ్వాలని.. వారికి ఇచ్చిన మాట ప్రకారం సముచిత స్థానం కల్పించాలని ఆయన భావిస్తున్నారట.. తొలి విడత నామినేటెడ్ పదవులు గుంటూరు జిల్లాకే ఎక్కువ పదవులు ఉంటాయనేది పార్టీ వర్గాల సమాచారం.. మొత్తంగా ఎవరికి ఏ పోస్ట్ ఇస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news