40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది నన్ను ఎవరూ ఓడించలేరు అని 2019 ఎన్నికల్లో చంద్రబాబు అని ఘోరంగా ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇటువంటి ఓటమి రాలేదని అంత దారుణంగా వైసిపి పార్టీ చేతిలో చంద్రబాబు ఓడిపోయాడని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు 2019 ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత స్పందించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా వైసిపి పార్టీ అధినేత జగన్ ని పెద్దగా ప్రత్యర్థిగా కూడా చంద్రబాబు తీసుకోలేక పోయారని అందువల్లే ఓడిపోవడం జరిగిందని చాలా మంది మేధావులు కామెంట్లు చేయడం జరిగింది.
కాగా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు ఇంకా అటువంటి మాట తీరే కనబరుస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తుంది. మేటర్ లోకి వెళితే ఇటీవల అమరావతి రాజధాని రైతులు తెనాలి లో నిర్వహించిన సభలో చంద్రబాబుని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..’పిల్ల కుంకలు.. నాకు పాఠాలు చెబుతున్నారు..’ అంటూ చంద్రబాబు, ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిపోయారు. ‘ఎన్నికల సమయంలో చెప్పాను.. వైసీపీకి ఓటేస్తే కరెంటు తీగ పట్టుకున్నట్లేనని.. ఇప్పుడు ఏమయ్యింది.. మీరంతా మాడి మసైపోయారు..’ అంటూ జనాన్ని ఉద్దేశించి సెటైర్లు వేశారు చంద్రబాబు.
దీంతో చాలామంది చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విని ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి ఇంకా అహంకారపూరితంగా చంద్రబాబు వ్యవహరించడం బాధాకరమని ఇటువంటి మాట తీరు వల్లే చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.