వాన‌ల‌కు కేసీఆర్ కు లింక్‌.. మినిస్ట‌ర్ మ‌ల్లారెడ్డిని ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు

అదేంటో గానీ టీఆర్ ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డి ఏది మాట్లాడినా చివ‌ర‌కు ఆయ‌న‌కు చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఆయ‌న ఏదో ఒకటి మాట్లాడి కేసీఆర్ లేదంటే కేటీఆర్ దృష్టిలో ప‌డాల‌ని చూస్తున్నా కూడా అదే ఆయ‌న్ను అభాసుపాలు చేస్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో కురుస్తున్న వ‌ర్సాల‌కు ఆయ‌న కేసీఆర్‌ను లింక్ పెట్టి కేటీఆర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయాల‌ని చూశారు. కానీ అది కూడా చివ‌ర‌కు ఆయ‌న్ను మ‌ళ్లీ ట్రోలింగ్‌కు దారి తీసేలా చేసింది. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ప‌ట్ట‌ణాలు, కాల‌నీలు అన్నీ నీట మునుగుతున్నాయి.

ఇక ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌నాలు కూడా చాలా ర‌కాల ఇబ్బందులు ప‌డుతున్నారుఉ. ఇలాంటి సున్నిత‌మైన అంశాల‌పై చాలా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే ప‌బ్లిక్ ఫైర్ అవ‌డం ప‌క్కా. మ‌రి మంత్రి మ‌ల్లారెడ్డి అయితే ఇలాంటివి పెద్ద‌గా ఆలోచించుకుండానే మాట్లాడుతుంటారు కాబ‌ట్టి మ‌రోసారి అలాగే చేశారు. ఎలా అంటే నిన్న టీఆర్ ఎస్ పార్టీ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొన్నారు. ఇక ఇందులో మాట్లాడిన మ‌ల్లారెడ్డి తెలంగాణ‌లో ఇప్పుడు ప‌డుతున్న వ‌ర్షాలు మొత్తం కేసీఆర్ వ‌ల్లే అని చెప్పారు.

ఇన్ని రోజులు ఆయ‌న వ‌ల్లే వాన‌లు ప‌డుతున్నాయ‌ని కాక‌పోతే ఇప్పుడు ఎక్కువ‌గా అయ్యాయ‌ని చెప్పారు. ఇక వ‌ర్షాలు చాలు అని వ‌రుణ దేవుడిని కోరుతున్నానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయ‌న మాట‌లు ఇప్పుడు మ‌రోసారి నెటిజ‌న్ల‌కు కోపం తెప్పించాయి. కేసీఆర్ కార‌ణంగానే వ‌ర్షాలు ప‌డుతుంటే కేసీఆరే ఇప్పుడు ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌కు బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ వెంట‌నే వ‌ర్షాలు ఆపేయాల‌ని కోరుతున్నారు. వెంట‌నే వ‌ర్షాల‌ను కేసీఆర్ ఆపేందుకు మంత్రి మ‌ల్లారెడ్డి కేసీఆర్‌కు పూజ‌లు చేయాల‌ని ట్రోల్ చేస్తున్నారు.