రిటర్నింగ్ అధికారి ప్రకటించడానికంటే ముందే ఓటర్ హెల్ప్ లైన్ లో ఎన్నికల కమిషన్ సిబ్బంది ఫలితాలను అప్ డేట్ చేస్తారు. దీంతో రౌండ్ రౌండ్ కు ఎవరికి ఎంత మెజారిటీ ఉంది.. ఎవరు గెలవబోతున్నారనే విషయాన్ని మీ అరచేతిలోనే మీరు ఎక్కడున్నా చూసుకోవచ్చు.
దేశ ప్రజలంతా కళ్లు కాయలయ్యేలా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. రేపే లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఒక్క రోజులో దేశంలో అంతా తలకిందులుగా మారనుంది. ఏం జరుగుతుందో ఏమో.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు. మళ్లీ మోదీయేనా? లేక రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా? తెలంగాణలో మళ్లీ కారు జోరేనా? ఏపీలో పరిస్థితి ఏంటి.. చంద్రబాబా? జగనా? ఇలా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు.. దేశ ప్రజలందరికీ రేపటి ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది.
రేపు అందరూ టీవీలకు అతుక్కుపోవడం తప్పించి ఇంకో పని చేయరు. అయితే.. ఎన్నికల ఫలితాల కోసం చాలామంది న్యూస్ చానెల్స్ నే నమ్ముకుంటారు. అయితే.. కొన్ని న్యూస్ చానెల్స్ ఒక రకంగా.. మరికొన్ని మరో రకంగా ఫలితాలను చూపిస్తుంటాయి. వేటిని నమ్మాలో.. వేటిని నమ్మొద్దో ఒక క్లారిటీ ఉండదు. ఇటువంటి అయోమయాలకు, గందరగోళాలకు చెక్ పెట్టి.. దేశ ప్రజలకు ఖచ్చితత్వమైన ఫలితాలను మినట్ టు మినట్ అందించడానికి ఎన్నికల కమిషన్ ఒక యాప్ ను రూపొందించింది.
దాని పేరే ఓటర్ హెల్ప్ లైన్ యాప్. ఈ యాప్ ను మీ మొబైల్ ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ప్రతి రౌండ్ కు సంబంధించిన ఫలితాలు ఈ యాప్ లో ప్రత్యక్షమవుతాయి. మినట్ టూ మినట్ అప్ డేట్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి.
రిటర్నింగ్ అధికారి ప్రకటించడానికంటే ముందే ఓటర్ హెల్ప్ లైన్ లో ఎన్నికల కమిషన్ సిబ్బంది ఫలితాలను అప్ డేట్ చేస్తారు. దీంతో రౌండ్ రౌండ్ కు ఎవరికి ఎంత మెజారిటీ ఉంది.. ఎవరు గెలవబోతున్నారనే విషయాన్ని మీ అరచేతిలోనే మీరు ఎక్కడున్నా చూసుకోవచ్చు. అవి కూడా ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలు. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఈ యాప్ ను వెంటనే ఇన్ స్టాల్ చేసేసుకోండి.