పందెంకోళ్ళ‌ని మించేలా సంక్రాంతి సినీ వార్‌ !

ఒకేరోజు రెండు మూడు సినిమాలు విడుద‌లైన సంద‌ర్భాలున్నాయి. సినిమా బాగుంటే వాట‌న్నింటికి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని గ‌తంలో వ‌చ్చిన సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే మాదిరికి వ‌చ్చే సంక్రాంతికి ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాలో పోటీప‌డుతున్నాయి. పందెంకోళ్ళ మాదిరి బాక్సాఫీసు వ‌ద్ద ఫైట్ చేయ‌బోతున్నాయి.

ఏ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనైనా పండుగ‌ల‌కు, వేస‌వి సెల‌వుల్లో భారీ సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. ఆయా టైమ్‌లో ఆడియెన్స్ సినిమాలు చూసేందుకు ఆస‌క్తిని చూప‌డం ఓ కార‌ణ‌మైతే, సెల‌వులు కావ‌డం మ‌రో కార‌ణం. దీంతో ఆ టైమ్‌లో త‌మ సినిమాల‌ని విడుద‌ల చేసి క్యాష్ చేసుకోవాల‌నుకుంటారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. చాలా వ‌ర‌కు సంక్రాంతికి భారీ సినిమాలో బ‌రిలో ఉంటాయి.

Tollywood cine war will be like cock fight for Sankranthi

ఒకేరోజు రెండు మూడు సినిమాలు విడుద‌లైన సంద‌ర్భాలున్నాయి. సినిమా బాగుంటే వాట‌న్నింటికి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని గ‌తంలో వ‌చ్చిన సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే మాదిరికి వ‌చ్చే సంక్రాంతికి ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాలో పోటీప‌డుతున్నాయి. పందెంకోళ్ళ మాదిరి బాక్సాఫీసు వ‌ద్ద ఫైట్ చేయ‌బోతున్నాయి.

ప్ర‌భాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న న‌యా సినిమా సంక్రాంతినే టార్గెట్ చేశారు. 1980నాటి ప్రేమ క‌థ‌తో పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం గ్యాప్ లేకుండా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. యువి క్రియేష‌న్స్, గోపీకృష్ణ బ్యాన‌ర్స్ పై తెర‌కెక్కున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

దీంతోపాటు వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా ఉన్నారు. ఇటీవ‌ల మ‌హ‌ర్షితో మంచి విజ‌యాన్ని అందుకున్న మ‌హేష్ నెక్ట్స్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ వినోదాత్మ‌క చిత్రం చేస్తున్నారు. ఇది వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానుంది. ర‌ష్మిక మంద‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాని కూడా సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

మ‌రోవైపు సంక్రాంతి బాల‌కృష్ణకి బాగా క‌లిసొచ్చే సీజ‌న్‌. గ‌తంలో వ‌చ్చిన ఆయ‌న సినిమాలు చాలా వ‌ర‌కు మంచి విజ‌యాల‌ని సాధించాయి. ఇప్ప‌డు కే.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాని కూడా సంక్రాంతి టార్గెట్‌గా పూర్తి చేయాల‌ని బాల‌య్య భావిస్తున్నార‌ట‌. సి.క‌ల్యాణ్ నిర్మించే ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్ పూత్ క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని తెలుస్తుంది.

దీంతోపాటు అల్లు అర్జున్ సైతం సంక్రాంతి పుంజుగా బ‌రిలోకి దిగ‌బోతున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టిస్తున్న తాజా సినిమాని సంక్రాంతి పండుగ‌ని పుర‌స్క‌రించుకుని విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే నిజ‌మైతే ఈ సారి సంక్రాంతి సినిమా పోటీ పందెంకోళ్ల‌ని మించి ఉంటుంద‌ని, అది టాలీవుడ్‌లోనే భారీ బిగ్ ఫైట్ కాబోతుంద‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు.