లోకేశ్ స్పీక్స్ : ఆ విధంగా జ‌గ‌న్ మ‌ళ్లీ వివాదంలోకి…

-

ఆడబిడ్డ‌ల భ‌ద్ర‌త‌కు త‌మ ప్ర‌భుత్వం స‌మ ప్రాధాన్యమిస్తుంద‌ని త‌రుచూ చెప్పే జ‌గ‌న్ ఎందుక‌నో ఆచ‌ర‌ణ‌లో విఫ‌లం అయి, ఆ కోపం అంతా విప‌క్ష పార్టీల‌పై రుద్దుతున్నారు.ఈ కార‌ణంగానే జ‌గ‌న్ ప‌దే ప‌దే వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు. తిరుప‌తి కేంద్రంగా ఆయ‌న మాట్లాడిన మాట‌లే ఇప్పుడు సంచ‌ల‌నాత్మ‌కం అవుతున్నాయి. ఓ బాధ్య‌త ఉన్న సీఎం ఓ బాధ్య‌త ఉన్న హోం మంత్రి ఈ విధంగా విప‌క్షాల‌ను కార్న‌ర్ చేయ‌డం, అస‌లు విష‌యం గాలికి వ‌దిలేయ‌డం నిజంగానే బాధాకరం అన్న‌ది టీడీపీ వాద‌న.

ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన ప్ర‌భుత్వం అస్స‌లు ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా విఫ‌లం అవుతూనే ఉంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డ‌ర్ క‌ట్టుతప్పుతోంది అన్న‌ది ఓ విమ‌ర్శ. ఇదే వాస్త‌వం కూడా ! స‌రైన నిర్ణ‌యాలు స‌రైన ఆలోచ‌న‌లు అమ‌లు చేయ‌డం సాధ్యం అయితే అత్యాచార ఘ‌ట‌న‌లు నిలువ‌రించ‌డం అన్న‌ది ఓ ప్ర‌భుత్వానికి క‌ష్టం అయిన ప‌నేం కాదు. అసాధ్యం కానేకాదు. కానీ రాష్ట్రంలో వ‌రుస ప‌రిణామాలు వైసీపీ ప‌రువును కాపాడ‌లేక‌పోతున్నాయి. జాతీయ స్థాయిలో అత్యాచార ఘ‌ట‌న‌లు చ‌ర్చకు వ‌చ్చినా, మాట్లాడిన వారిదే త‌ప్పు అన్న విధంగా వైసీపీ పెద్ద‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

వ‌ర‌సు అత్యాచార ఘ‌ట‌న‌ల‌తో రాష్ట్రం అతలాకుత‌లం అయిపోతున్నా కూడా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నది టీడీపీ బాధ. ఆవేద‌న కూడా..! దీనిని స‌రిగా అర్థం చేసుకుంటే మంచి పాల‌న అందించ‌వచ్చు అన్న‌ది కూడా సూచ‌న‌. ఈ నేప‌థ్యాన పాల‌న‌కు సంబంధించి ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నా అవి అప‌రిష్కృతం అయి ఉన్నాయి. కానీ ఏవీ ఎప్పుడూ ఓ స్థిర నిర్ణ‌యం ఆధారంగా జ‌ర‌గ‌డం లేదు. దీంతో అత్యాచార నిందితుల‌కు సరైన రీతిలో శిక్ష‌లు ప‌డడం లేదు అన్న‌ది టీడీపీ ఎప్ప‌టిక‌ప్పుడు వినిపిస్తున్న వాద‌న. అయినా కూడా జ‌గ‌న్ ఇవాళ త‌మపై స్పందించిన తీరు బాలేద‌ని విప‌క్షం ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో లోకేశ్ ఏమ‌న్నారంటే..

“ఆడబిడ్డలు బలైపోతుంటే సిఎం జగన్ రెడ్డి గారు మహిళల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరం. ఇలాంటి ఘటన మీ ఇంట్లో జరిగితే ఇంతే వెటకారంగా మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు? మీ మహిళా హోంమంత్రి గారేమో పెంపకంలో తేడా వలనే రేప్ లు జరుగుతున్నాయని మహిళల్ని అవమానపరుస్తున్నారు. ఒక యువతిని ప్రభుత్వ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం చేస్తే మీరు ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నాయి అనడం సబబేనా? అంబులెన్స్ మాఫియా వేధింపులు తట్టుకోలేక ఒక తండ్రి బిడ్డ మృత దేహాన్ని బైక్ పై తీసుకెళ్తే టిడిపి యాగీ చేస్తుంది అనడం కరెక్టేనా? మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి జగన్ రెడ్డి గారు. ” అని అన్నారు నారా లోకేశ్..

Read more RELATED
Recommended to you

Latest news