బ్రేకింగ్; సిఎంగా మళ్ళీ ఆయనే ప్రమాణ స్వీకారం…!

-

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి కూల్చిన సంగతి తెలిసిందే. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చిన బిజెపి వారితో రాజీనామాలు చేయించింది. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ను బిజెపిలోకి ఆహ్వానించడం ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్ రాకుండా జాగ్రత్తలు పడటం చేసింది.

గవర్నర్, సుప్రీం కోర్ట్ ఇద్దరూ కూడా బలపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడ౦తో బలపరీక్ష ఎదుర్కొకుండానే ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాథ్ గవర్నర్ ని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అంతకు ముందే రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించారు. ఇక అక్కడి నుంచి రాజకీయంగా వేగంగా మారిపోయింది.

కాంగ్రెస్ బలం 104 కి పడిపోయింది, 107 మంది సభ్యుల బలంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సాయంత్రం ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు మధ్యప్రదేశ్ లో వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ. 15 ఏళ్ళ పాటు మధ్యప్రదేశ్ సిఎం గా ఉన్నారు ఆయన. దీనితో ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోపెట్టాలని ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news