మల్కాజిగిరి మల్లారెడ్డి అల్లుడుకే..మైనంపల్లికి బంపర్ ఆఫర్?

-

మల్కాజిగిరి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మైనంపల్లి హనుమంతరావు బి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో సీన్ మారిపోయింది. బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు ఫిక్స్ అయిన సరే మైనంపల్లి తన తనయుడు సీటు కోసం పార్టీని వీడారు. కే‌సి‌ఆర్ సీట్లు ప్రకటించే ముందే మైనంపల్లి..హరీష్ రావు టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన తనయుడుకు సీటు రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

అప్పటికే అభ్యర్ధుల లిస్ట్ ఖరారు కావడంతో మైనంపల్లికి మల్కాజిగిరి సీటు ఖరారైంది. కానీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే మైనంపల్లి పార్టీని వీడారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక మైనంపల్లి పార్టీని వీడటంతో మల్కాజిగిరి అసెంబ్లీ బరిలో బి‌ఆర్‌ఎస్ తరుపున మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోటీకి దిగుతారని తెలిసింది. దాదాపు ఆయన అభ్యర్ధిత్వం ఖరారైపోయింది. దీంతో మల్లారెడ్డి అల్లుడుతో మైనంపల్లి పోటీ పడనున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారుతుంది.

అయితే కాంగ్రెస్ లోకి వస్తున్న ఆయన ..మూడుసీట్లు అడుగుతున్నట్లు తెలిసింది. తనకు మల్కాజిగిరి…తన తనయుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ, అనుచరుడు నక్కా ప్రభాకర్ గౌడ్‌కు మేడ్చల్ సీటు అడుగుతున్నట్లు తెలిసింది. ఇందులో మైనంపల్లి, తన తనయుడుకు దాదాపు సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక మల్కాజిగిరిలో మైనంపల్లి విజయం ఈ సారి సులువు కాదనే చెప్పాలి.

మల్లారెడ్డి అల్లుడు ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత..దీంతో గట్టి పోటీ తప్పదు. అయితే మైనంపల్లి బలమైన ఫాలోయింగ్ ఉన్న నేత. అటు కాంగ్రెస్ ఓటింగ్ కూడా కలిసిరావచ్చు. దీంతో మల్కాజిగిరి పోరు ఈ సారి రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news