త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై దీదీ విమర్శలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని… కాంగ్రెస్ పార్టీ విశ్వనీయత కోల్పోయిందని.. కాంగ్రెస్ పార్టీపై ఆధారపడలేం అని ఆమె విమర్శించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ అధిర్ రంజన్ చౌదురి తీవ్రంగా స్పందించారు. మమతాబెనర్జీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చివాళ్ల వ్యాఖ్యలపై ఎక్కువగా స్పందించకూడదని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీదీ దగ్గర ఉందా? ప్రతిపక్షాల మొత్తం ఓట్లలో కాంగ్రెస్‌కు 20% ఉంది. ఆమె వద్ద ఉందా? బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు, బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు మమతాబెనర్జీ ఇలా మాట్లాడుతుందని విమర్శించారు. కాంగ్రెస్‌పై ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుంటే మమతా బెనర్జీ లాంటి వారు పుట్టి ఉండేవారు కాదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ పార్టీకి సహకరిస్తూ గోవాలో పోటీ చేశారని.. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచారంటూ వ్యాఖ్యానించారు. ఈవిషయం దేశం మొత్తానికి తెలుసన్నారు.