నన్ను అరెస్టు చేస్తారు.. బీజేపీ ప్లాన్ అదే : మనీశ్ సిసోదియా

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజాప్రతినిధులకు నోటీసులు అందించారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా త్వరలోనే సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు. ఇవాళ ఉదయం సీబీఐ కార్యాలయానికి బయలుదేరే ముందు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా బీజేపీ ప్లాన్ చేస్తోందని.. అందుకే తనను నకిలీ కేసులో అరెస్టు చేసేందుకు వ్యూహం పన్నుతోందని సిసోదియా ఆరోపించారు. ‘రానున్న రోజుల్లో నేను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. నన్ను ఆపడమే వారి ఉద్దేశం. ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. బీజేపీ ప్లాన్‌లో భాగంగా నన్ను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారు. నేను గుజరాత్‌ వెళ్లినప్పుడు.. దిల్లీ లాంటి అద్భుతమైన పాఠశాలలు నిర్మిస్తామని అక్కడి ప్రజలకు చెప్పాను. కానీ  ఇది కొందరికి నచ్చడం లేదు. అయితే నేను జైలుకు వెళ్లడంతో ఈ ఎన్నికల ప్రచారం ఆగదు.  రానున్న రోజుల్లో ఆ ఎన్నికలు ఉద్యమంలా మారనున్నాయి’ అని సిసోదియా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news