సంగ్రామ యాత్ర‌పై బీజేపీ నేత‌ల్లో ఎన్నో ప్ర‌శ్న‌లు..

రాష్ట్రంలో ఇప్ప‌డు పాద‌యాత్ర‌ల జోరు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు బీజేపీ అధ్య‌క్షుడు అయిన బండి సంజ‌య్ కూడా అట్టహాసంగా ప్ర‌జా సంగ్రామ యాత్రకు తెర లేపారు. అయితే ఆయ‌న ఈ పాద‌యాత్ర‌ను మాత్రం విడతలవారీగా చేయాలని చూసినా చివ‌ర‌కు ఎక్కడ నిలిచిపోతుందో చెప్పలేని పరిస్థితి వ‌చ్చింది ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను చూస్తే. ఇక ఆయ‌న‌మ మాత్రం అధికార‌మే ల‌క్ష్యంగా రాబోయే రెండేళ్ల వ‌ర‌కు కూడా ఎక్కువ రోజులు పాదయాత్ర ద్వారా జనంలో ఉంటాన‌ని, ఇందుకోసం ఏమైనా చేస్తానంటూ చెప్పారు.

అయితే ఆయ‌న మైనారిటీ వర్గాలను ప‌ట్టించుకోకుండా కేవ‌లం మెజారిటీ వర్గాలను త‌న వైపు తిప్పుకోవాల‌ని, అప్పుడే త‌మ‌కు రాజ్యాధికారం సాధ్య‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అస‌లు మెజారిటీ ప్రజల్లో బీజేపీ విధానాల‌పై పెద్ద‌గా నమ్మకం లేక‌పోవ‌డం క‌నిపిస్తోంది. అయితే ఈ సంగ్రామ యాత్ర ద్వారా సంజ‌య్ ఎక్కువ‌గా ద‌ళితులు, అలాగే గిరిజ‌నుల‌ను ఆక‌ట్టుకోబుత‌న్న‌ట్టు చెబుతున్నారు.

అయితే సంజ‌య్ చేస్తున్న పాద‌యాత్ర‌లో మాత్రం ఒక విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే బీజేపీ చరిత్రలో తొలిసారిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలా జ‌నాల్లోకి వెల్లేందుకు పాద‌యాత్ర‌ల‌ను షురూ చేయడం ఇదే తొలిసారి. ఇప్పుడు ఆయ‌న పాద‌యాత్ర దాదాపుగా 40 రోజుల పాటు కొనసాగుతుంది. కానీ ఆయ‌న మాట‌ల‌ను మాత్రం ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ట్లేద‌నేది పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే ప‌ట్టేలేని జిల్లాల్లో సంజ‌య్ పాద‌యాత్ర పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇన్ని ర‌కాల ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న పాద‌యాత్ర ఎలాంటి జ‌వాలు వినిపిస్తుందో చూడాలి.