ఉమ్మడి మెదక్ జిల్లా..సిఎం కేసిఆర్ సొంత జిల్లా..అందుకే కేసిఆర్ సొంత జిల్లా అనేసరికి..ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఫోకస్ చేస్తాయి..జిల్లాలో సత్తా చాటాలని చూస్తాయి. అయితే గత రెండు ఎన్నికల్లో జిల్లాలో బిఆర్‌ఎస్ హవా నడుస్తుంది. ఈ సారి కూడా బిఆర్‌ఎస్ వేవ్ కనిపిస్తుంది..కానీ కాంగ్రెస్ పార్టీ కాస్త పోటీ ఇచ్చేలా ఉంది. ఇదే క్రమంలో మెదక్ జిల్లాలో టఫ్ ఫైట్ జరిగే సీట్లలో మెదక్ అసెంబ్లీ కూడా ఒకటి. ఇక్కడ ఒకప్పుడు టిడిపి, కాంగ్రెస్ హోరాహోరీగా గెలిచేవి.
అయితే తెలంగాణ వచ్చాక 2014 నుంచి సీన్ మారింది. బిఆర్‌ఎస్ నుంచి వరుసగా పద్మా దేవేందర్ రెడ్డి గెలుస్తున్నారు. మరి ఈ సారి కూడా ఆమె గెలుస్తారా? అంటే మొదట ఆమెకు సీటు విషయంలో పోటీ ఉంది. మళ్ళీ సీటు దక్కించుకుని గెలవాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ సీటు కోసం మరో ఇదరు నేతలు పోటీ పడుతున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితునిగా ఉన్న శేరి సుభాష్ రెడ్డి ఎప్పటి నుంచో మెదక్ సీటుపై కన్నేశారు.
అటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్ కూడా ఈ సీటుపైనే ఫోకస్ పెట్టారు. 2009లో మైనంపల్లి టిడిపి నుంచి ఇక్కడ గెలిచారు. దీంతో అక్కడ పాత పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన తనయుడుని ఆ సీటుకి పంపించారు. ఇక రోహిత్ సేవా కార్యక్రమాలు చేస్తూ..సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే కేసిఆర్ ఎవరికి సీటు ఇస్తారో ఇంకా తేలలేదు.
అటు కాంగ్రెస్ లో సీటు కోసం పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో పాటు చౌదరి సుప్రభాతరావు, డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరికి సీటు వస్తుందో క్లారిటీ లేదు. బీజేపీలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, తాళ్ళపల్లి రాజశేఖర్లు ఈసారి పోటీపడుతున్నారు. అయితే ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉండనుంది.