ప్ర‌తి ప‌క్ష పార్టీల‌ స‌మావేశం.. మ‌మ‌తా కు సోనియా షాక్

-

టీఎంసీ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ కి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ షాక్ ఇచ్చారు. మంగ‌ళ వారం సోనియా గాంధీ నివాసం లో నిర్వ‌హించిన ప్ర‌తి ప‌క్షాల స‌మావేశానికి టీఎంసీ పార్టీ కి స‌మాచారం ఇవ్వ‌లేదు. టీఎంసీ పార్టీ ప్ర‌తినిధులు లేకుండానే ప్ర‌తి ప‌క్షాల స‌మావేశం జ‌రిగింది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెనర్జీ వ‌రుస గా కాంగ్రెస్ పార్టీ పై విమ‌ర్శ‌లు చేస్తుంది.

కాంగ్రెస్ పార్టీ కి రోజులు చెల్లాయ‌ని.. త‌మ పార్టీ యే ప‌త్యామ్నాయం గా ప్ర‌జ‌లు ముందు ఉంద‌ని ప‌లు సంద‌ర్భాల‌లో ప్ర‌క‌టించింది. అలాగే కేంద్రం లో ఉన్న బీజేపీ స‌ర్కార్ కు వ్య‌తిరేకం గా ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు.. ఆ ఫ్రంట్ లో కాంగ్రెస్ ప్ర‌మేయం ఉండ‌ద‌నే వార్తలు కూడా వ‌స్తున్నాయి. ఈ కార‌ణాల‌తో నే మ‌మ‌తా బెనర్జీ కి ఆహ్వానం పంప‌లేద‌ని తెలుస్తుంది. కాగ మంగ‌ళ వారం జ‌రిగిన ప్ర‌తి ప‌క్షాల స‌మావేశం లో ఇటీవ‌ల పార్లమెంట్ నుంచి 12 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం పై కీల‌కం గా చర్చించిన‌ట్టు తెలుస్తుంది. కాగ ఈ స‌మావేశంలో ఎన్సీపీ, శివసేన‌, డీఎంకే, సీపీఎం నేత‌లు హాజ‌రు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news