చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు సేకరించిన విషయం అందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా తాజాగా పేదలకు ఇల్లు ఇవ్వాలని భూములను సమీకరించాలని జగన్ సర్కార్ ఇటీవల ఏపీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని వేల ఎకరాలను అమరావతి ప్రాంతంలో గుర్తించిన జగన్ సర్కార్ త్వరలోనే వాటిని పేదలకు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో విశాఖ పట్టణంలో గత ప్రభుత్వాలు పేదలకు భూముల కేటాయిస్తూ వాటిని డి పట్టా లేకపోతే పి ఓ టి భూములు కింద లెక్క వేసి వారికి ఉపాధి ఇచ్చే విధంగా సాగు చేసుకునే విధంగా పంపిణీ చేసింది. అయితే తాజాగా జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతో ఇటువంటి భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు అదంతా ప్రభుత్వ భూమే అయినప్పటి సమీకరణ కింద భూములు తీసుకోబోతున్నట్లు భూములు ఇచ్చిన వారికి దాదాపు 250 నుండి తొమ్మిది వందల గజాల వరకు ఓ ఇంటి స్థలం ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో వైజాగ్ ప్రజల నుండి ఊహించని ప్రశ్న జగన్ సర్కార్ కి ఎదురైనట్లు సమాచారం.
అమరావతి ప్రాంతంలో మీకు ఇష్టం లేని ప్రాంతంలో పేదలకు భూములు ఇచ్చి మీకు ఇష్టం గా ఉండే వైజాగ్ ప్రాంతంలో పేద ప్రజల నుండి భూములు లాక్కోవటం చాలా దారుణమని డి పట్టా భూములు, పీవోటీ భూములు కలిగినవారు కామెంట్లు చేస్తున్నారు.