పవన్‌కి మంత్రి అమరనాథ్‌ పది ప్రశ్నలు

-

ఉత్తరాంధ్ర తరపున జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి 10 ప్రశ్నలు సంధించారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్.బ్రో సినిమా వివాదానికి కొనసాగింపుగా ఆయన మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా… విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటిస్తే.. స్వాగతించకపోగా, వ్యతిరేకించిన పవన్‌కు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే అర్హత ఉందా..?అని ప్రశ్నించారు అమరనాథ్‌. విశాఖ, ఉత్తరాంధ్ర.. ఈ అంశాల మీద బాబు స్టాండే జనసేన స్టాండ్ అని దుయ్యబట్టాడు.

బాబు తానా అంటే పవన్‌ తందానా అనే పవన్‌కి వ్యక్తిత్వం ఉందా..?అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉన్న పవన్‌ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు?అని అన్నారు. పైగా అదే నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు నెడుతున్నావ్‌ అని ప్రశ్నించారు. విశాఖలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే.. కోర్టులో కేసులు వేయించి చంద్రబాబు అడ్డుకున్నప్పుడు బాబుకు సపోర్ట్‌ చేస్తూ తందానా అనలేదా అని అన్నారు.రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి అసలు పేదల వ్యతిరేక పెత్తందార్ల జాబితాలో ఎందుకు చేరారని పవన్‌ని తిట్టిపోశారు.

ఇంకా అమర్‌నాథ్‌ ఏమన్నారంటే. .. . 2014-19 మధ్య 40 గుడులు కూలగొట్టిన అప్పటి జాయింట్ ప్రభుత్వానికి దేవుడు మీద నమ్మకం, మతం అంటే భయం- భక్తి ఏ కోశాన లేవు కదా..?అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు తన కమీషన్ల కోసం ముందుకు కదలకుండా ఆపితే, అదే బాబుకు ఎందుకు వంత పాడావని జనసేనానికి ప్రశ్న వేశారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు,2014 ఉమ్మడి పాలనలో కేంద్రానికి మోకరిల్లినప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయావ్?అని అన్నారు. ఉద్దానంలో కిడ్నీ జబ్బులతో జనం పిట్టల్లా చనిపోతున్నా.. కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం జగన్ ప్రభుత్వం నెలకొల్పిన డయాలసిస్, రీసెర్చ్ సెంటర్, రక్షిత తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏనాడైనా సంస్కారవంతంగా అభినందించావా అని ప్రశ్నించారు.

సంక్షేమ విప్లవంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను, ప్రభుత్వ సేవలను ప్రతి గడపకు అందిస్తున్న వాలంటీర్లను- హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ అవమానించిన పవన్‌ క్షమాపణలు చెప్పాలి అని అమరనాథ్‌ డిమాండ్‌ చేశారు. చివరిగా, ప్రాజెక్టులపై యుద్ధ భేరి పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, టీడీపీ శ్రేణులను అల్లర్లకు ఉసిగొల్పుతూ, దాడులు చేయిస్తూ, ప్రజలపై దండయాత్ర చేస్తూ, పుంగనూరులో 40 మంది పోలీసులపై దాడి చేస్తే, అందులో ఒక కానిస్టేబుల్ కన్ను పోతే.. ఖండించని పవన్‌ రాజకీయ పార్టీని నడపడానికి అనర్హుడని మండిపడ్డారు. తాను సంధించిన పది ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాలని అమర్‌నాథ్‌ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news