మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్…!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కీలకం అయ్యాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం విషయంలో విపక్షాలు ఎన్నో ఆరోపణలు చేసాయి. అయితే తెలంగాణా ప్రభుత్వం మాత్రం ఇళ్ళ నిర్మాణం విషయంలో చాలా దూకుడుగా వెళ్తుంది. తాజాగా జియాగూడ లో 840 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు.

జియాగూడ డివిజన్లో ప్రతిష్ఠాపకంగా చేపట్టిన 840 డబుల్ బెడ్ రూమ్ లను 536 లబ్డిదారులకు మంత్రి కేటీఆర్, హోమ్ మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని చేతుల మీదుగా పంపిణీ చేశారు. దీనిపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని నివాసాలను పంపిణీ చేసే అవకాశం ఉంది.