ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన ఆయన సోదరుడు…!

-

ఏపీలో ఎండలతో పాటుగా రాజకీయాలు కూడా బాగా మండుతున్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీకి మాత్రం భలే షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ పార్టీ కలలో కూడా ఊహించి ఉండదు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Minister Somireddy Chandramohan Reddy brother Sudhakar Reddy joins YSRCP

తాజాగా… వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాలోని పార్టీ ఆఫీసులో కాకణి గోవర్ధన్ సమక్షంలో ఆయన వైసీపీ పార్టీలో చేరారు. ఈసందర్భంగా కాకణి గోవర్ధన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇంతకుముందు సోమిరెడ్డి బావ కోటరెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news