అమ్మ చంద్రబాబూ… నాడే ప్లాన్ చేసి, నేడు ఇలానా?

-

చంద్రబాబు పాలన ముగిసి తిప్పి తిప్పి ఏడాది దాటింది అంతే..! ఇంతలోనే తాను చేసిన పరిపాలనను, తాను సీఎం గా ఉన్నప్పుడు విడుదల చేసిన జీవోలను, వేసిన కమిటీలను జనం మరిచిపోయారు అని భావిస్తున్నట్లున్నారు చంద్రబాబు! ఇంక తాను ప్రతిపక్షంలోకి వచ్చేశాం కాబట్టి… గతంలో చేసిన పనులు తనఖాతాలో పడవని, ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చెయ్యొచ్చని భావించిన తరుణంలో… బాబు గతంలో చేసిన పనులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నారు వైకాపా నేతలు!

ఇందులో భాగంగా వైకాపా ప్రభుత్వం టీటీడీ భూములను అమ్మేస్తుందని హడావిడి చేస్తున్న ఒక వర్గం పత్రికలకు, టీడీపీ నేతలకు వైకాపా నాయకులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు! బాబు గత వైభవాన్ని గుర్తుచేస్తూ.. జగన్ పాలనకు బాబు చేసిన పాలనకు తేడాలు క్లియర్ గా చెబుతూ బాబు బండారాన్ని బయటపెట్టే పనికి పూనుకున్నారు! ఈ క్రమంలో టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తుందంటూ దుష్ప్రచారం చేస్తోన్నారని…టీడీపీ హయంలో టీటీడీ చైర్మన్‌ గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులుగా భాను ప్రకాష్‌ రెడ్డి వున్నప్పుడే టీటీడీలో ఉపయోగం లేని భూములను వేలం వేసేలా ఒక కమిటీ వేశారని.. గతంలోనే 50 రకాల ఆస్తులను అమ్మాలని గుర్తించారని.. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.

ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి సైతం ఆరోజు ఈ వ్యవహారంపై ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టిన ఆయన… చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఒప్పుగా… అదే నిర్ణయాలను జగన్ అమలు చేస్తుంటే తప్పుగా కనిపించడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు! దీంతో… ఒకే దెబ్బతో అటు ఎల్లో మీడియాకు, టీడీపీ నేతలకు గూబలు వాచినట్లే అనేది వైకాపా నేతల కామెంట్!

అక్కడితో ఆగని వెల్లంపల్లి… చంద్రబాబులా చీకటి జీవోలు ఇచ్చి భూములు అమ్మే ఆలోచన సీఎం జగన్‌ కు లేదని… చంద్రబాబులా సదావర్తి భూములు దొంగచాటుగా వేలం వేయాలని జగన్ నిర్ణయించలేదని… చంద్రబాబులా దోచుకోవాలనే ఆలోచన సీఎం జగన్‌ కు లేదని… గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచిని సేకరిస్తాం, చెడును ఉపేక్షించమని వెల్లంపల్లి స్పష్టం చేస్తున్నారు! దీంతో… అమ్మ చంద్రబాబు అండ్ కో… నాడు తమరు అధికారంలో ఉన్నప్పుడే ఈ భూములు అమ్మేయాలని కమిటీలు వేసి… నేడు జగన్ ఆ భూములను వేలం వేస్తుంటే… రాజకీయ రంకెలు వేస్తున్నారా… ఎంత తెలివి… జనాల జ్ఞాపకశక్తిపై ఎంత చులకన భావం అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news