మోడి ని కలిసి వచ్చిన 24 గంటల్లో భారీ ట్విస్ట్ ఇచ్చిన మోహన్ బాబు

113

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చాలా ఘాటైన విమర్శలు చేశాడు. బహిరంగంగానే అతడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఈ సినీ నటుడు ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ ఎన్నికల తర్వాత నుంచి అసలు పార్టీ కార్యక్రమాల్లో ఎటువంటి ఆసక్తి చూపించలేదు.

 

అయితే తాజాగా ఆయన బిజెపిలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మొన్ననే మోడీ ని కలిసి ఆ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చారు. సరే పార్టీకి అతనికి అంచనాలు లేవు.. అతను కూడా పార్టీలో అంత ఆసక్తి లేదు అనుకుంటున్న సమయంలో కొత్తగా ఒక పుకారు బయటకు వచ్చింది. తాజాగా మోహన్ బాబు మోడీని కలిసిన సమయంలో జగన్ కి తెలియకుండా వైకాపా మంత్రితో ఫోన్లో మాట్లాడారు అని అంతా చెబుతున్నారు.

జగన్ ఒక పక్క రాజధాని విషయమై ఎవరి మాట వినని ఓ మోనార్క్ లాగా ముందుకు పోతుంటే ఇదే సమయంలో మోహన్ బాబు మోదీ ని కలవడం మరియు వైకాపా లోని ఒక ప్రముఖ మంత్రితో ఫోన్లో చర్చించడం లాంటివి చూస్తుంటే కేంద్రంలోని పెద్దలు అంతా జగన్ రాజధాని విషయాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో గమనిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబు మోదీని కలవడం యాద్రుశ్చికమా లేదా పక్కా ప్లానా అన్నది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.