ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై చర్చించారు. త్వరలోనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగుస్తుండటంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
గత సంవత్సరం అక్టోబర్ నుంచి తెలంగాణలో ఓట్ల పండుగలే పండుగలు. ఎంతలా అంటే ఒక ఎన్నిక అయిపోగానే మరో ఎన్నిక. ఇలా ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఇటీవలే లోక్ సభ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. ఈ ఎన్నికలపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై చర్చించారు. త్వరలోనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగుస్తుండటంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ ఎన్నికల నిర్వహణపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. ఈనెల 22 నుంచి వచ్చే నెల 14 వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఫలితాలు మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాతే విడుదల చేస్తారు.