మ‌రో నెల‌లో స్థానిక పోరు… జ‌గ‌న్ ట్రాప్‌లో పార్టీలు..?

-

మ‌రో నెల‌లో అంటే.. దాదాపు జ‌న‌వ‌రి చివ‌రి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌కు, గ్రామ పంచాయ‌తీల‌కు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌బుత్వం రెడీ అవుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఓట‌రు కార్డుల పంపిణీ, ఓట‌ర్ల లెక్కింపు, మదింపు వంటివాటిని ఫైన‌ల్ చేస్తోంది. ఆ వెంట‌నే ప్ర‌క‌ట‌న వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. మ‌రి ఈ క్ర‌మంలోమిగిలిన పార్టీలు ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ వంటివి పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పుడు ఇది కీల‌క‌మైన స‌మ‌యం. మ‌రో రెండు వారాల పాటు .. రాష్ట్రంలో ప్ర‌చారానికి అవ‌కాశం ఎక్కువ‌.

అయితే, ఈ స‌మ‌యంలో సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ఓ పావు క‌దిపారు. రాజ‌ధాని అనే తే నెతుట్టెను ఆయ‌న క‌దిలించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ముచ్చ‌ట‌ను తెర‌మీదికి తెచ్చారు. అంతే!! ఒక్క‌సారిగా అన్ని పార్టీల గుండెల్లోనూ గుబులు పుట్టించారు. దీంతో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూడా పార్టీల ప‌రిస్థితిపై దృష్టి పెట్టిన టీడీపీ కానీ, జ‌న‌సేన‌కానీ బీజేపీ కానీ.. ఇప్పుడు జ‌గ‌న్ ట్రాప్‌లో చిక్కుకుని రాజ‌ధాని విష‌యాన్ని త‌ప్ప‌నిస‌రి అజెండాగా భుజానికి ఎత్తుకున్నాయి.

అదే స‌మ‌యంలో అటు క‌ర్నూలు విష‌యంలోను ఇటు విశాఖ విష‌యంలోనూ స‌మ‌ర్ధించ‌క‌పోతే.. రాజ‌కీయంగా ఇబ్బంది ప‌డే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. పోనీ.. అలాగ‌ని టీడీపీ వంటి కీల‌క‌మైన పార్టీ వాటిని స‌మ‌ర్ధిస్తే.. అమ‌రావ‌తిలో ఆపార్టీని న‌మ్ముకుని వ్యాపా రాలు ప్రారంభించిన వారు. పెట్టుబ‌డులు పెట్టిన వారు.. రైతులు ఇలా అనేక వ‌ర్గాలు పార్టీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఉంది. ఒక వేళ ఇత‌ర జిల్లాల్లో రాజ‌ధానులు స‌మ‌ర్ధించినా.. ఏ పార్టీకి ప్ర‌జ‌లు జైకొట్టే ప‌రిస్థితి లేదు.

ప్ర‌ధాన పార్టీలు జై కొట్టినా.. ఇది కూడా జ‌గ‌న్ ఖాతాలోకే చేరిపోతుంది. మేం చెప్పాకే ఇత‌ర జిల్లాల అభివృద్ధిపై మాట్లాడుతున్నార‌నే వ్యాఖ్య‌లు వైసీపీ నుంచి వ‌చ్చే ఛాన్స్ ఉంది. సో.. మొత్తంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అయినా పుంజుకుందామ‌ని, ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ని అంచ‌నా వేసుకున్న టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు ఆ మాత్రం టైం కూడా లేకుండా జ‌గ‌న్ వ్యూహం ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీని నుంచి వారు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news