జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన తరువాత తొలిసారి లఢక్ లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశంలోని ప్రతీ సంస్థలో తన వ్యక్తులను ఉంచుతుందన్నారు. బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అని.. అందుకే అది అన్నిటినీ నడుపుతోందని ఆరోపించారు.
కేంద్ర మంత్రుల్లో ఎవ్వరినీ అడిగినా వారు తాము మంత్రిత్వ శాఖలను నడపడం లేదని చెబుతారు. ఆర్ఎస్ఎస్ నియమించిన వారే ఈ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ సొంత వ్యక్తులను సంస్థాగత నిర్మాణంలో కీలక పదవుల్లో ఉంచుతున్నాయన్నారు. రాజ్యాంగ దార్శనికతకు తోడ్పడే సంస్థలను ఏర్పాటు చేయడమే రాజ్యాంగాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. అంతకు ముందు లేహ్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ను వీక్షించారు రాహుల్ గాంధీ. శనివారం పాంగాంగ్ సరస్సు సమీపంలోకి బైక్ పై వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.