ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై.. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఖాళీ ఉన్నప్పుడల్లా కాదు కాదు ఖాళీ చేసుకుని మరీ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కూడా అదే జరిగింది. ఇక సీఎం జగన్ ప్రతి శుక్రువారం కోర్టుకు హాజరు కావాల్సిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ కు శుక్రువారం అంటే కోర్ట్ వారం… ఎక్కడ ఉన్నా సరే శుక్రువారం వస్తే.. కోర్ట్ కి హాజరు కావాల్సిందే అంటూ ప్రతిపక్ష నేతలు అనేక రకాలుగా సెటైర్లు వేస్తుంటారు.
ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే జాలేస్తోందని, శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలా అని స్కూల్ పిల్లాడిలా సాకులు వెతుక్కోవాల్సి వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వారంలో మిగిలిన రోజులు తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నజగన్ శుక్రవారం వచ్చేసరికి తాను సీఎంనని గుర్తుకు వచ్చి ఏదో పర్యటనో, రివ్యూనో పెట్టి కోర్టుకు రాలేనంటూ కబురు పంపుతుంటారని వ్యంగ్యోక్తి విసిరారు.