నూని గాడు అంటూ.. నానిని మళ్లీ గెలికిన శ్రీ రెడ్డి

-

న్యాచురల్ స్టార్ నాని-శ్రీరెడ్డి వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ అంటూ నానిపై శ్రీరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ సమయంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని లేపాయో అందరికీ తెలిసిందే.అయితే ఏనాడు కూడా శ్రీరెడ్డి పేరును మాత్రం ఎత్తలేదు నాని. పరువు నష్టం దావా వేసినట్టు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మాత్రం తెలిపాడు.

ఈ వ్యవహారం జరిగి చాలా రోజులే అయింది. కానీ శ్రీ రెడ్డి మాత్రం నానిని వదిలిపెట్టడం లేదు. సమయం దొరికినప్పుడల్లా నానిపై విరుచుకుపడుతూనే ఉంటుంది. ఆ మధ్య నాని, నాగార్జున, దగ్గుబాటి సురేష్ ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయని వార్తలు వస్తే.. అప్పుడు కూడా నానిపై విమర్శలు చేసింది. తాజాగా మళ్లీ నానిపై కామెంట్స్ చేస్తూ గెలికింది.

నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ సినిమా నిన్న (ఫిబ్రవరి 28)నే విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ మూవీ గురించి శ్రీ రెడ్డి పోస్ట్‌లు పెట్టింది. హిట్టా.. ఫట్టా.. అంటూ ఓ పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి.. ఆపై కొంత సమయం తరువాత నూని గాడు ఓమ్ భూమ్ ఫట్ అంటగా అంటూ పిచ్చి పిచ్చి పోస్ట్‌లు చేసింది. ఇప్పటికే రాకేష్ మాష్టర్,కరాటే కళ్యాణి వ్యవహారంతో శ్రీరెడ్డి హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news