తెలంగాణ విషయంలో అన్నీ మూసుకుంటున్న చినబాబు!

-

తెలుగుదేశాన్ని జాతీయ పార్టీ అనొద్దని.. ఉప ప్రాంతీయ పార్టీ అని పిలిస్తే భావ్యంగా ఉంటుందని కామెంట్లు వస్తున్న సంగతి తెలిసిందే. జాతీయస్థాయిలో చక్రాలు గట్రా తిప్పడం సంగతి దేవుడెరుగు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మనుగడ కాపాడుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. మనుగడ సంగతి దేవుడెరుగు… కనీసం ఆ రాష్ట్రంలో బాదిత కుటుంబాలను సందర్శించే పనికి, ఓదార్చే పనికి, ఆ సంఘటనపై స్పందించే పనికి కూడా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పూనుకోవడం లేదు.

nara-lokeshఅవును… ప్రస్తుతం టీడీపీ దృష్టంతా ఏపీ రాజకీయాలపైనే ఉంది. చినబాబు భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత ఏపీ ప్రజలపైనే ఉంది. అందుకే చినబాబు కూడా ఏపీలో జరిగే అత్యాచారలు, హత్యలపైనే దృష్టిపెడుతున్నారు. అంతేతప్ప.. పక్కనున్న తెలంగాణలో, ఆయన నివాసం ఉంటున్న హైదరాబాద్ లో జరిగిన దారుణాలపై కూడా స్పందించలేకపోతున్నారు. ఇందుకు సింగరేణి కాలనీలో జరిగిన పసికందు అత్యాచారం – హత్య సంఘటనే ఉదాహరణ!

కరోనా పేరుచెప్పి ఏపీనుంచి పలయనం చిత్తగించినట్లుగా.. భాగ్యనగరానికే పరిమితయమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఆయన నివాసం ఉంటున్న చొటికి అతి సమీపంలో జరిగిన బాలిక కుటుంబాన్ని సందర్శించే పనికి పూనుకోలేకపోయారు. పోనీ ఏపీలో బిజీగా ఉన్నారనుకుంటే… కనీసం ఆ సంఘటనను ఖండించడం, విచారణ వ్యక్తం చేయడం కూడా చేయలేకపోయారు. ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయారు – పోలీసులను ప్రశ్నించలేకపోయారు!

దీంతో రకరకాల ప్రశ్నలు, కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వెలువడుతున్నాయి! ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి.. ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని చెబుతున్న చినబాబు.. తెలంగాణపై ఎందుకు స్పందించడం లేదు? ఆయన దృష్టిలో తెలంగాణ రాష్ట్రం మహిళలకు స్వర్గధామం – మహిళా భద్రతకు పెట్టింది పేరా? చినబాబే చెప్పాలి!

కేసీఆర్ అంటే ఉన్న భయం – తెలంగాణలో వెంటిలేటర్ పై ఉన్న పార్టీ పరిస్థితే ఆ మౌనానికి కారణమా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కే తెలియాలి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకే తెలియాలి! ఎందుకు తెలంగాణలో జరుగుతున్న దారుణాల విషయంలో కళ్లూ – చెవులూ – నోరూ కూడా మూసుకుంటున్నారో చెప్పాలని తెలంగాణ టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news