ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి వెళ్లనున్న నర్సీపట్నం డాక్టర్ ?

-

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు సుధాకర్ రావు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. కరోనా వైరస్ చికిత్స చేస్తున్న వైద్యులకు ప్రభుత్వం కనీసం మాస్క్​లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదని ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తే నర్సీపట్నం అంతా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ టైం లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన బాధ్యతగా పట్టించుకోవడంలేదని విమర్శించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పేరుకే 150 పడకల ఆసుపత్రి ఉందని కనీసం వైద్య సౌకర్యాలు ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవల ఒక మాస్క్​ ఇచ్చి 15 రోజులు వాడుకోమని అంటున్నారని ఆరోపించారు.ఏపీలో కరోనా: తప్పుచేశానన్న ...ఈ విధంగా ఆసుపత్రిలో పనిచేస్తే కరోనా వైరస్ మొత్తం నర్సీపట్నం లో ప్రబలుతుంది అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆసుపత్రిలో అనుభవం లేని జూనియర్ వైద్యురాలి తో చికిత్స చేయిస్తున్నారని…ప్రస్తుతం నిపుణురాలు ఇంతవరకూ ప్రభుత్వం నియమించలేదని అన్ని విషయాలు మత్తు డాక్టర్ సుధాకర్ బయటపెట్టారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కనీసం ఆసుపత్రిని పట్టించుకునే స్థితిలో లేరని విమర్శించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దింతో వెంటనే ప్రభుత్వం జరిగిన ఘటనపై, అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న పరికరాలు గురించి వైద్యుడు సుధాకర్ రావు చేసిన ఆరోపణల్లో నిజం ఉందో లేదో తేల్చడానికి విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.

 

అయితే ఈ విషయంలో విచారణ కమిటీ ఇంకా రిపోర్ట్ ఇవ్వకుండానే వైద్యుడు చేసిన ఆరోపణల్లో నిజం ఉందో లేదో విచారణ కమిటీ రిపోర్ట్ బయటకు రాకముందే ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ రావు ని  సస్పెన్షన్ విధించింది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తనపై అన్యాయంగా ఎటువంటి కమిటీ రిపోర్ట్ రాకముందే సస్పెన్స్ విధించిన ప్రభుత్వం పై ఫిర్యాదు చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అసలు ఎటువంటి రిపోర్ట్ రాకముందే ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.  

 

Read more RELATED
Recommended to you

Latest news