సిటీనటి ఖుష్బూ స్థానంలో నవ్యకు ఛాన్స్ ఇచ్చిన బిజేపీ.. కాంగ్రెస్ కు చెక్ పెడతారా..?

-

వయనాడ్ ఉప ఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. గత లోక్ సభ ఎన్నికలో పోటీ చేసిన రెండు స్థానాల్లో రాహుల్ గెలిచారు..ఈ నేపథ్యంలో వయనాడ్ కు రాజీనామా చేశారు.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగు వేసింది.. అగ్రనాయకురాలుగా ఉన్న ప్రియాంక గాంధీని అక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకుంది.. వాక్చాతుర్యం కల్గిన ప్రియాంక అయితే.. ఖచ్చితంగా గెలిచి తీరుతుందని అధిష్టానం భావిస్తోంది..

వయనాడ్ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని కమలనాధులు ప్లానేస్తున్నారు..వచ్చిన అవకాశాన్ని ఈసారి చేజార్చుకోకూడదని గట్టిపట్టుదలతో ఉన్నారు.. ప్రియాంక గాంధీ మీదకు పోటీగా తొలుతా సిటీ ఖుష్బూను బరిలోకి దింపాలని భావించారు.. సినీ గ్లామర్ తో పాటు.. ప్రత్యర్దులపై మాటల తూటాలు పేల్చడంలో ఖుష్బూ దిట్టగా పేరుంది.. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు.. ఆమె స్థానంలో కేరళ బిజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్ననవ్యా హరిదాస్ ను బరిలోకి దింపాలని డిసైడైంది బిజేపీ అధిష్టానం..

సీపీఐ నుంచి సీనియర్ నేత సత్యన్ మొకేరీన్, కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, బిజేపీ నుంచి నవ్య హరిదాస్ మధ్య ఆసక్తికరమైన పోరు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.. వయనాడ్ పార్లమెంట్లో పాగా వేసేందుకు బిజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. అందులోనూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ సోదరి, భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే లక్షణాలు కల్గిన ప్రియాంకను ఓడిస్తే.. తాము పైచేయి సాధించినట్లు అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది.. ఈ క్రమంలో అన్ని కోణాల్లో ఆలోచించిన బిజేపీ.. రాజకీయాల్లో యాక్టివ్ గా..అన్ని విషయాల్లో అనర్గళంగా మాట్లాడే నవ్యను బరిలోకి దింపుతోంది..

నవంబర్ 13న పోలీంగ్ జరుగనుంది.. ఇప్పటికే ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్దులను ప్రకటించిన బిజేపీ.. ప్రచారంలోనూ దూసుకెళ్లేందుకు సిద్దమవుతోంది.. గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన సీపీఐ కూడా ఈ స్థానంపై కన్నేసింది.. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది.. దీంతో తమకున్న పట్టును.. నిలుపుకునేందుకు సీఎం విజయన్ కూడా సీరియస్ గా దృష్టిపెట్టారు..మొత్తంగా ఈ మూడు పార్టీల మధ్య పోటీ పొలిటికల్ గా ఇంట్రస్టింగ్ మారిందని చెప్పుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news