కోటంరెడ్డి అరెస్ట్: చంద్రబాబుకూ, జగన్‌కూ అదే తేడా..!?

-

ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆయన అరెస్టు చేయించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ అరెస్టు ద్వారా ఎవరినైనా ఉపేక్షించేదిలేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో గతంలో చంద్రబాబు హయాంలోని సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. సేమ్ సీన్ చంద్రబాబు ప్రభుత్వంలోనూ జరిగింది. అక్కడా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఓ ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనా అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనే. ఈ విషయంపై అప్పట్లో చాలా దుమారం రేగింది. పత్రికలు పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశాయి.

కానీ అప్పటి సీఎం చంద్రబాబు చింతమనేనిపై ఈగ వాలనీయలేదు. పైగా బాధితురాలిని పిలిపించుకుని వ్యవహారం సెటిల్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పటి వ్యవహారాన్ని అప్పటి వ్యవహారాన్ని పోల్చి చూస్తే జగన్, చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా తేలిపోతుందంటున్నారు విశ్లేషకులు. ఓ ఎమ్మెల్యే హద్దు మీరి ప్రవర్తించాడు.. అందులోనూ అధికార పామ్మెల్యే.. ఫుల్లుగా మందు కొట్టి ఓ ఎంపీడీవో ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేశారు.

పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేయాలా వద్దా.. ఇదే సందేహం… సీఎం దగ్గర పోలీసు బాసులు వెలిబుచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కదా ఏదో మేనేజ్ చేస్తారులే అని అంతా అనుకున్నారు.. కానీ సీఎం సొంత ఎమ్మెల్యేను అరెస్టు చేయించి అందరికీ షాక్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news