నెల్లూరులో మారుతున్న సమీకరణాలు..ఆ ముగ్గురుపై వేటు?

-

నెల్లూరులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీకి వన్‌సైడ్ గా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు టి‌డి‌పి రేసులోకి వచ్చింది. ఇప్పటికే వైసీపీకి ధీటుగా ఎదుగుతున్న టి‌డి‌పికి అనూహ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేల మద్ధతు అడ్వాంటేజ్ అవుతుంది. వైసీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బయటకొచ్చిన విషయం తెలిసిందే. వీరు చాలా రోజుల నుంచే సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు వేశారని చెప్పి ఈ ముగ్గురుతో పాటు ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. ఇక నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర మొదలైన నేపథ్యంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు వచ్చారు. ఆనం, కోటంరెడ్డి, మేకపాటి ఈ ముగ్గురు నెల్లూరు ఎమ్మెల్యేలే..ఈ క్రమంలో వారు లోకేష్ పాదయాత్రకు మద్ధతు తెలుపుతున్నారు.

మొదట లోకేష్ పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలైంది. అక్కడ పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యత ఆనం తీసుకున్నారు. ఇక నెక్స్ట్ మేకపాటి, కోటంరెడ్డి లోకేష్ పాదయాత్రలో పాల్గొనున్నారు. అయితే పాదయాత్ర తర్వాత వారు టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టి‌డి‌పిలో చేరే ఛాన్స్ ఉంది. కాకపోతే ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉంది కాబట్టి వైసీపీ ప్రభుత్వం వారిపై వేటు వేసిన ఉపఎన్నికలు వచ్చే ఛాన్స్ తక్కువగానే ఉంది.

అదే సమయంలో వీరిపై వేటు వేస్తే..టి‌డి‌పి నుంచి వైసీపీ వైపుకు వెళ్ళిన వల్లభనేని వంశీ, కరణం బలరామ్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ ల గురించి చర్చ వస్తుంది. కాబట్టి వైసీపీ..ఆనం, కోటంరెడ్డి, మేకపాటిల ఎమ్మెల్యేల పదవిపై వేటు వేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news