ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీని కొట్టేవారే లేరిన చెప్పాలి. ఎందుకంటే ఎంతో గన చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీనే ఇప్పటికీ కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. ఇలాంటి తరుణంలో అసలు ఉనికిలోనే లేని అలాగే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలోనే ఆంధ్రా ప్రజలు ఆ పార్టీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే దాన్ని పాతాలానికి తొక్కేశారు. కాగా ఇన్నేండ్లకు ఆ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తేవాలని ఢిల్లీ అధిష్టానం భావిస్తోందంట.
ఇందుకోసం ఏపీకి కొత్త బాస్‌ను దీపావళి పండుగ తర్వాత నియమించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సాకే శైలజానాథ్ సరిగ్గా పార్టీని నడిపించట్లేదని, అందుకే కొత్త బాస్ కావాలంటూ చెబుతున్నారంట. ఇక ఈ విషయాలను స్వయంగా కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ చెప్పడంతో ఏపీ రాజకీయా్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. దీపావళి తర్వాత ఈ విషయంలో మార్పు ఉంటుందంట.
అయితే ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతోంది. అదేంటంటే పార్టీకి కొత్త బాస్ వస్తే ఏం ఉపయోగం ఉంటుంది. అసలు ఆ పార్టీకి ఎవరు బాస్ గా ఉన్నా సరే ఏపీలో ఒరిగేదేమీ లేదని అందరూ వివరిస్తున్నారంట. కారణం ఏంటంటే ఏపీని విభజన సందర్భంగా నష్టపోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మెజారిటీ జనాలు ఆ పార్టీని అడ్డడుక్కు తొక్కేశారు. అలాంటిది ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో ఎవరు బాస్ అయినా చేసేది ఏమీ ఉండదని చెబుతున్నారు. మరి ఢిల్లీ అధిష్టానం ఈ సారి ఎవరికి అవకాశం ఇస్తుందో వేచి చూడాలి.