చినబాబు రివర్స్ షాక్ ఇచ్చారుగా…పవన్‌తో కలిసి…

-

ఏపీలో తాజాగా వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం కొనసాగిన విషయం తెలిసిందే. 90 శాతం ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలని వైసీపీనే కైవసం చేసుకుంది. ప్రతిపక్ష టి‌డిపికి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో కూడా వైసీపీ విజయ యాత్ర కొనసాగింది. అలాగే చంద్రబాబు కంచుకోట కుప్పంలో సైతం వైసీపీ దుమ్ముదులిపింది. అక్కడ ఏకపక్షంగా వైసీపీ విజయాలని దక్కించుకుంది.

nara lokeshఇటు పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలో కూడా వైసీపీ ఆధిక్యం కొనసాగింది. మరి విచిత్రం ఏంటో గానీ రాష్ట్రమంతా వైసీపీ హవా కొనసాగితే నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరిలో మాత్రం టి‌డి‌పి ఆధిక్యం కొనసాగింది. మరి వైసీపీ నేతలు కుప్పంపై ఫోకస్ చేసి బాబుకు షాక్ ఇస్తే, చినబాబు మంగళగిరిలో సత్తా చాటి వైసీపీకి రివర్స్ షాక్ ఇచ్చారు.

మంగళగిరిలోని దుగ్గిరాల మండల పరిషత్ పరిధిలో ఉన్న 18 ఎం‌పి‌టి‌సి స్థానాల్లో టి‌డి‌పి 9 గెలుచుకోగా, వైసీపీ 7 చోట్ల గెలిచింది. జనసేన 2 చోట్ల గెలిచింది. కానీ ఇక్కడ జనసేన గెలిచిన స్థానాల్లో ఒక ట్విస్ట్ జరిగింది. జనసేన… ఈమని-1 ఎం‌పి‌టి‌సి స్థానాన్ని మాత్రమే గెలుచుకుందని చివరిలో ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే పెదకొండూరులో కూడా జనసేన 67 ఓట్లతో గెలిచిందని మొదట ప్రకటించారు…కానీ వైసీపీ పట్టుబట్టడంతో రీకౌంటింగ్ చేశారు. మామూలుగా 10 ఓట్లు లోపు మెజారిటీ ఉంటే రీకౌంటింగ్ చేస్తారు. కానీ అధికార పార్టీ ఒత్తిడితో రీకౌంటింగ్ చేస్తే చివరికి జనసేనకు 3 ఓట్ల మెజారిటీ వచ్చింది.

కానీ అధికారికంగా వైసీపీ 21 ఓట్ల మెజారిటీతో గెలిచిందని అధికారులు ప్రకటించారు. దీంతో వైసీపీ ఖాతాలో 8 ఎం‌పి‌టి‌సిలు వచ్చి చేరాయి. కానీ ఎం‌పి‌పి స్థానం గెలుచుకోవాలంటే 10 ఎం‌పి‌టి‌సిలు కావాలి. ఇప్పుడు జనసేన, టి‌డి‌పికి సపోర్ట్ చేస్తే ఎం‌పి‌పి గెలుచుకోవచ్చు. మరి వైసీపీ అధికారం బలం ఏమన్నా ఉపయోగిస్తే చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Latest news