సోషల్ మీడియాలో #ByeByeIndiaOnlyBharat ఉద్యమం.. ఇండియా కాదు భారత్‌

-

పాఠకుల్లారా ఇప్పటి వరకు మీరు ఎన్నో ఉద్యమాలు చూసి ఉంటారు.. ఆ ఉద్యమాలు వ్యక్తులకు సంబంధించో, కులమతాలకు సంబంధించో, లేదా రాష్ట్ర, దేశాలకు సంబంధిచినవిగా ఉన్నాయి.. కానీ ఒక పేరు మార్పుకోసం జరుగుతున్న ఉద్యమం కోసం ఎప్పుడైనా విన్నారా.. అదేంటండి అలా ఉద్యమం చేస్తున్నట్లుగా ఏ వార్త రాలేదని అంటున్నారా.. అయితే ఇది రోడ్లెక్కి చేస్తున్న ఉద్యమం కాదట.. కేవలం ఇది సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. కానీ దీని వెనక పెద్ద తతంగమే ఉంది..

అదేంటని ఆలోచిస్తున్నారా.. అయితే వినండి మనదేశానికి ఎన్ని పేర్లున్నాయో తెలుసా.. ఒక సారి చరిత్రను పరిశీలిస్తే మొత్తం ఎనిమిది పేర్లు ఉండేవి.. అవి ఇండియా, హిందూస్థాన్, ఆర్యావర్తం, భారత వర్ష, జంబూద్వీపం, నాభివర్షం, తియాన్ఝు, హొడు మొదలైనవి.. ఇక ఆన్నీ పోగా మనదేశానికి ఇండియా, భారత్ అని రెండే మిగిలాయి.. ఇందులో ప్రపంచ దేశాలకు ఇండియా అంటేనే బాగ గుర్తు.. ఇక మనవారైతే మేం భారతీయులం అని గర్వంగా చెప్పుకుంటారు.. అయితే బ్రిటీష్ పాలన కాలంలో హిందుస్థాన్‌గా పిలవబడే మనదేశాన్ని వారికి పలకడం రాకపోవడంతో ఇండియా అని మార్చేశారు.. అలా ఇండియాగా మారి ఇన్ని సంవత్సరాలుగా పిలవబడుతున్న మనదేశాన్ని ఇప్పుడు భారత్‌గా మాత్రమే పిలవబడాలి అనే ఉద్యమం సోషల్ మీడియాలో మొదలైంది. #ByeByeIndiaOnlyBharat హ్యష్‌ ట్యాగ్‌తో ట్రెండింగ్‌ అవుతోంది.

ఇందుకోసం ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ కూడ వేశారు. కాగా దానిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. ఇక మనదేశాన్ని భారత్‌ లేదా హిందుస్తాన్‌గా మార్చాలనేది అతని వాదన.. ఇలా ఎందుకు మార్చాలి అనే దానిపై అతను రకరకాల వాదనలు వినిపిస్తున్నాడు.. అయితే ఈ పిటిషన్‌ను సమర్థిస్తున్న నెటిజన్లు బైబై ఇండియా ఓన్లీ భారత్ అనే నినాదం అందుకున్నారు. అది ఓ సైలెంట్ రివల్యూషన్‌గా మారింది. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news