హుజూరాబాద్‌లో కొత్త రాజ‌కీయం.. టీఆర్ ఎస్ నేత‌ల‌కు ఝ‌ల‌క్‌!

హుజూరాబాద్‌లోరాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు కాస్త మౌనంగా ఉన్న ఈట‌ల వ‌ర్గీయులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. వ‌రుస‌గా టీఆర్ ఎస్ నేత‌ల‌కు షాక్ లు ఇస్తున్నారు. మొన్న‌టికి మొన్న ఎమ్మెల్సీ నార‌దాసు పెట్టిన మీటింగులో జై ఈట‌ల అంటూ నినాదాలు చేసిన వారు.. ఇప్పుడు మ‌రో షాక్ ఇచ్చారు.

 

మొన్న వీణవంక ఘటనలో నానా హంగామా చేసిన ఈట‌ల అనుచ‌రులు.. ఇప్పుడు చల్లూరులోనూ అదే స్థాయిలో రెచ్చిపోయారు. టీఆర్ఎస్ సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఆయన్ను అడ్డుకొని ‘జై ఈటల’ అంటూ నినాదాలు చేేశారు.

ఈటల విషయంలో తమను అడ‌గ‌కుండా ఎందుకు ఏక‌ప‌క్ష నిర్ణ‌యం తీసుకున్నారంటూ మండిప‌డుతున్నారు. ప్రజల్లో ఎంతో మంచి పేరున్న ఈటలపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేశారని ఆయన అనుచరులు బ‌హిరంగంగానే కేసీఆర్‌, కేటీఆర్ ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. దమ్ముంటే ఈట‌ల‌ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక‌పై హుజూరాబాద్‌లో ఏ మీటింగ్ పెట్టిన అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.